Begin typing your search above and press return to search.
తెలంగాణలో అన్ లాక్ 3.0 ఏమేం మారనున్నాయంటే.
By: Tupaki Desk | 1 Aug 2020 6:50 AM GMTకరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని.. దశల వారీగా ఒక్కొక్కటి అన్ లాక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సర్కారు తన అన్ లాక్ 3.0ను విడుదల చేసింది. ఈ నిబంధనలు ఆగస్టు 31 వరకు అమలు కానున్నాయి. తాజా అన్ లాక్ తో పలు వాణిజ్య కార్యకలాపాలకు అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇంతకాలం అమలవుతున్న రాత్రిపూట కర్ఫ్యూ ఇకపై ఉండదు. రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా ప్రయాణాలకు అనుమతులుఉంటాయి. ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి.. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారి విషయంలో ఎలాంటి ఆంక్షలు ఉండవు. కంటైన్ మెంట్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ అమలు చేస్తారు.
కేంద్రం సూచనలకు తగ్గట్లే.. తెలంగాణలోనూ స్కూళ్లు.. కాలేజీలు.. కోచింగ్ సెంటర్ల మీదా ఈ నెలాఖరు వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అదే సమయంలో సినిమాహాళ్లు.. స్విమ్మింగ్ ఫూల్స్.. బార్లు.. పబ్ లు.. మెట్రో రైలు తదితర సేవల మీద ఇప్పటివరకూ ఉన్న ఆంక్షలు కొనసాగనున్నాయి. అంతేకాదు.. రాజకీయ.. క్రీడా.. సామాజిక.. కల్చరల్ సభలు.. సమావేశాలకు అనుమతులు ఉండవు.
లాక్ డౌన్ సమయంలో విధించిన నిబంధనలకు అనుగుణం గానే పెళ్లిళ్లకు యాభై మందిని మాత్రమే ఆహ్వానించాల్సి ఉంటుంది. అదే సమయంలో అంత్యక్రియలకు ఇరవై మంది వరకు అనుమతి ఉంటుంది. అంతర్ రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు ఆంక్షలు ఎత్తేయటం ప్రజలకు గొప్ప రిలీఫ్ గా మారుతుందని చెప్పక తప్పదు. రాత్రిళ్లు కర్ఫ్యూ ఎత్తేయటం తో.. గతం లో మాదిరి రాత్రిళ్లు షాపులు లేటుగా మూయటం షురూ అయ్యే అవకాశాలు ఉన్నాయి.