Begin typing your search above and press return to search.
అయోధ్యలో గ్రౌండ్ రిపోర్ట్ ఏమంటే?
By: Tupaki Desk | 8 Nov 2019 5:21 AM GMTదశాబ్దాలు గా సాగుతున్న అయోధ్య లోని వివాదాస్పద స్థలంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ను ఇవ్వనుంది. ఈ నెల 17న తన తుది తీర్పును సుప్రీంకోర్టు వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అలెర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీ.. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం తమ నేతలకు విస్పష్ట ఆదేశాలు జారీ చేయటమే కాదు.. తొందరపడి ఎవరూ నోరు జారకూడదని స్పష్టం చేశారు.
అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భద్రతా పరమైన చర్యలు భారీగా తీసుకుంటున్న వేళ.. ఈ మొత్తానికి కారణమైన అయోధ్యలో పరిస్థితి ఎలా ఉంది? అక్కడి గ్రౌండ్ రిపోర్ట్ ఏమిటన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఉత్తరప్రదేశ్ కు చెందిన 4వేల మంది పారా మిలటరీ బలగాల్ని అయోధ్యకు పంపుతున్నారు. సిబ్బంది సెలవుల్ని రద్దు చేయనున్నారు. రైళ్లకు భద్రత పెంచాలని నిర్ణయించారు.
ఇటీవల కాలంలో రాత్రివేళల్లో రైల్వే స్టేషన్లలో రైళ్లు లేనప్పుడు 30 శాతం మాత్రమే లైట్లు వేయాలన్న ఆదేశాల్ని వెనక్కి తీసుకొని.. వందశాతం లైట్లను వెలిగించాలని నిర్ణయించారు. వీవీఐపీలు.. సైన్యం కదలికలపై ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం శిలల్ని చెక్కే పనుల్ని ఆపివేశారు. తీర్పు నేపథ్యంలో వీహెచ్ పీ అగ్రనేతలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. 1990 నుంచి శిల్పాల్ని చెక్కే పని ఆపటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. అయోధ్యకు ఉగ్రవాద ముప్పు ఉందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా బాంబుల్ని నిర్వీర్యం చేసే 30 దళాల్ని పంపారు.
అయోధ్య పట్టణంలోని ధర్మశాలల్లోని యాత్రికుల్ని ఈ నెల 12 లోపు ఖాళీ చేయించాలని నిర్ణయించారు. వివాదాస్పద ప్రాంతానికి చేరువ లో ఉన్న రామ్ కోట్ కు దారి తీసే అన్ని రోడ్లను పోలీసులు బంద్ చేశారు. మరో రెండు రోజుల్లో (10 తేదీ నాటికి) దాదాపు 300 కంపెనీల భద్రతా దళాలు అయోధ్యను కమ్మేయనున్నాయి. మొత్తంగా అయోధ్యలో ఇప్పుడు గంభీరమైన వాతావరణం నెలకొంది. పట్టణం మొత్తం ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని రీతిలో ఉంది. కంటికి కనిపించని ఉద్రిక్తత నెలకొన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు.