Begin typing your search above and press return to search.

వ‌లంటీర్ల‌కు టికెట్లు ఇచ్చేసే రేంజ్‌లో.. ఏపీలో ఏం జ‌రుగుతోందంటే!

By:  Tupaki Desk   |   30 July 2022 4:30 PM GMT
వ‌లంటీర్ల‌కు టికెట్లు ఇచ్చేసే రేంజ్‌లో.. ఏపీలో ఏం జ‌రుగుతోందంటే!
X
ఔను.. ఇప్పుడు ఎమ్మెల్యేలు.. మంత్రులు కూడా త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. త‌మ‌కు ఎద‌ర‌వుతున్న సం ఘట‌న‌లు త‌లుచుకుని.. నాయ‌కులు త‌ల్ల‌డిల్లుతున్నారు. వ‌లంటీర్ల‌కు టికెట్లు ఇచ్చేసే రేంజ్‌లో ప్ర‌జ‌ల మైండ్ సెట్ మారిపోతోంద‌ని.. నాయ‌కులు భావిస్తున్నారు. మ‌రి దీనికి కార‌ణం.. ఏమిటి? ఎందుకు? అంటే.. గ‌డిచిన మూడేళ్లుగా ప్ర‌జ‌ల‌కు.. నాయ‌కుల‌కు మ‌ధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోవ‌డ‌మేన‌ని అంతిమంగా తేలిపోయింది.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ప్ర‌స్తుతం నాయ‌కులు.. గ‌డ‌ప‌గ‌డ‌ప కార్య‌క్ర‌మం కింద‌.. ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నా రు. ఇష్టం ఉన్నా.. లేకున్నా.. జ‌గ‌న్‌.. చెప్పారు కాబ‌ట్టి.. నాయ‌కులు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్తున్నారు.

వారితో మాట‌లు క‌లుపుతున్నారు. అయితే.. ఈ మాట‌ల సంద‌ర్భంలో నాయ‌కుల‌ను ప్ర‌జ‌లు తిక‌మ‌క పెడుతు న్నారు. ''అమ్మా.. మీకు సంక్షేమ ప‌థ‌కాలు.. అందుతున్నాయి క‌దా!''అని మంత్రి నారాయ‌ణ స్వామి తాజాగా.. త‌న నియోజ‌క‌వ‌ర్గం గంగాధ‌ర నెల్లూరులోప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించారు.

దీనికి అందుతున్నాయ‌ని .. వారి నుంచి ముక్త‌కంఠంతో స‌మాధానం వ‌చ్చింది. ''అయితే.. మీకు ఇవ‌న్నీ ఎవ‌రిస్తున్నారు?'' అని మంత్రిఎదురు ప్ర‌శ్నించారు. దీనికి ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన స‌మాధానం.. ''ఇంకెవరు.. వ‌లంటీరే'' అని చెబుతున్నారు. దీంతోమంత్రికి దిమ్మ‌తిరిగిపోయింది. వాస్త‌వానికి వీటిని అందిస్తున్న‌ది వైసీపీ ప్ర‌భుత్వం.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. ఇక‌, ల‌బ్ధి దారుల‌ను సూచిస్తున్న‌ది మాత్రం ఎమ్మెల్యేలు. కానీ, ఇప్పుడు ఎమ్మెల్యేలను ప్ర‌జ‌లు మ‌రిచిపోయారు.

కేవ‌లం నిత్యం త‌మ ఇంటికి తిరిగే వ‌లంటీర్ల‌నే ప్ర‌జ‌లు గుర్తుపెట్టుకున్నారు. దీంతో త‌మ‌కు రావాల్సిన గుర్తింపు.. కాస్తా.. వ‌లంట‌ర్లు కొట్టేస్తున్నార‌నేది ఎమ్మెల్యేల ఆవేద‌న‌గా ఉంది. ఇదే.. గ‌తంలో జ‌గ‌న్ కూడా చెప్పారు.

మీరుప్ర‌జ‌ల‌కు చేరువ అవండి.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండండి.. లేక‌పోతే.. మిమ్మ‌ల్ని మ‌రిచిపోయే ప‌రిస్థితి వ‌స్తుంది.. జాగ్ర‌త్త! అని ఆయ‌న హెచ్చ‌రించారు. కానీ, ఎవ‌రూ అప్ప‌ట్లోలెక్క‌చేయ‌లేదు. ఇప్పుడు అనుభ‌వవంలోకి వ‌చ్చేస‌రికి.. రేపు వ‌లంటీర్‌ను నిల‌బెట్టినా.. గెలిచిపోయే రేంజ్‌లో వారి హ‌వా న‌డుస్తోంద‌ని.. ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా.. నాయ‌కులు ప్ర‌జ‌ల‌తో ఉంటారో లేదో చూడాలి.