Begin typing your search above and press return to search.

చైనాలో ఏదో జరుగుతోంది..? అధ్యక్షుడు జిన్ పింగ్ ఔట్

By:  Tupaki Desk   |   24 Sep 2022 8:12 AM GMT
చైనాలో ఏదో జరుగుతోంది..? అధ్యక్షుడు జిన్ పింగ్ ఔట్
X
ఉక్కు సంకెళ్ల చైనాలో ఏదో జరుగుతోంది..? ఏం జరిగినా.. ఆఖరికి కొవిడ్ వంటి మహమ్మారి పుట్టుకొచ్చినా ఏమీ కాని చైనాలో ఇప్పుడు పెద్ద కలకలమే రేగుతోంది. అది మామూలు కలకలం కూడా అన్నట్లు తెలుస్తోంది. కమ్యూనిస్టు కరుడుగట్టిన పాలనలో కనివినీ ఎరుగనంత కల్లోలం రేగుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వింత మహా గోడను మించిన పటిష్ఠమైన వ్యవస్థ ఉన్న చైనాలో ఏం ఎన్నడూ లేనివిధంగా పాలకుడిపై తిరుగుబాటు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

రాజధాని వైపు సైన్యం

చైనా సైన్యం ప్రపంచంలోనే అతిపెద్దది. వాస్తవానికి దాని సత్తా ఏమిటో కానీ.. అత్యంత బలమైనది అని చెబుతుంటారు. దానిని చూసుకునే చైనా పొరుగు దేశాలపై కాలుదువ్వుతుంటుంది. ఆఖరికి భారత్ నూ కయ్యానికి కాలుదువ్వేలా చేస్తుంది. సరిగ్గా రెండేళ్ల కిందట లద్దాఖ్ లోని గాల్వాన్ లోయలో ఇలాగే దుస్సాహసానికి తెగబడింది. మన సైనికుల అసమాన ప్రతిఘటనతో తోకముడించింది.

పదుల సంఖ్యలో చైనా సైనికులు నాడు చనిపోయినట్లు కథనాలు వచ్చాయి. కాగా, అరుణాచల్ ప్రదేశ్ లోనూ చైనా వేలుపెట్టి వివాదం రేపిన సంగతి తెలిసిందే. ఢోక్లాంలోనూ ఇదే తరహాలో డ్రాగన్ భంగపడింది. అయితే, ఏ సైన్యాన్ని చూసుకుని చైనా విర్రవీగుతుందో.. అదే సైన్యం ఇప్పుడు చైనా పాలకులను కిందకు దించేలా కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)గా చైనా సైన్యాన్ని పిలుస్తుంటారు. ఇప్పుడీ సైన్యం రాజధాని బీజింగ్ దిశగా కదులుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

వేలాదిగానే

బీజింగ్ వైపు వెళ్తున్న చైనా సైన్యం వెయ్యి, రెండు వేలు కాదు.. 50 వేల పైనే ఉంటుందని చెబుతున్నారు. వీరంతా ఇలా ఎందుకు వెళ్తున్నారో తెలియదు కానీ.. కిలోమీటర్ల కొద్దీ బారులు తీరిన వాహనాలను చూస్తే చైనాలో ఏమైనా తిరుగుబాటు జరుగుతున్నదా?? అనే సందేహాలు వస్తున్నాయి. అది కూడా బీజింగ్ దిశగా వెళ్తుండడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

జిన్ పింగ్ ఔట్???

చైనాకు జీవిత కాల అధ్యక్షుడిగా జిన్ పింగ్ ప్రకటించుకున్నారు. అయితే, ఆయన నియంత పోకడలు పోతున్నారని కమ్యూనిస్టు పార్టీ అభిప్రాయపడుతోంది. దీనికితగ్గట్లే జిన్ పింగ్ వ్యవహార సరళి ఉండేది. ఆయన పైకి నవ్వుతూ కనిపించినా.. మనసు నిండా నియంత ధోరణి అనే అభిప్రాయం ఉంది. కాగా, జిన్ పింగ్ ఈ నెల 16న షాంఘై కో ఆపరేషన్ సదస్సు లో పాల్గొని వచ్చారు.

ఆ సదస్సు నుంచి రాగానే విమానాశ్రయంలో జిన్ పింగ్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తాజాగా బీజింగ్ దిశగా 80 కిలోమీటర్ల మీర చైనా సైన్యం ర్యాలీ.. సంక్షోభంలో జిన్ పింగ్ హౌస్ అరెస్ట్ చేశారనే వార్తల నేపథ్యంలో మిలటరీ చేతుల్లోకి చైనా వెళ్లిందా? అనే కథనాలు వస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.