Begin typing your search above and press return to search.

ఏపీలో ఏం జ‌రుగుతోంది? టీడీపీలో ఎందుకింత అల‌జ‌డి..?

By:  Tupaki Desk   |   21 Nov 2022 3:48 AM GMT
ఏపీలో ఏం జ‌రుగుతోంది?  టీడీపీలో ఎందుకింత అల‌జ‌డి..?
X
రాష్ట్రంలో ఏం జ‌రుగుతోంది? టీడీపీలో వాతావ‌ర‌ణం ఎందుకు ఇంత అల‌జ‌డిగా మారిపోయింది? ఇదీ.. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా పొరుగు రాష్ట్రంలోనూ చ‌ర్చ‌కు వ‌స్తున్న కీల‌క అంశం. అనూ హ్యంగా చంద్ర‌బాబు నిప్పులు చెర‌గ‌డం.. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఆయ‌న కామెంట్లు చేయ‌డం.. నిప్పులు చెర‌గ‌డం దీనికి అనుకూలంగా టీడీపీ అనుకూల మీడియాలో ప్ర‌జ‌ల‌కు సుద్దులు చెప్ప‌డం వంటివి రాజ‌కీయంగా చ‌ర్చ‌కు మ‌రింత బ‌లాన్ని ఇస్తున్నాయి.

ప్ర‌స్తుతం టీడీపీలోను, ఇటు దాని అనుకూల మీడియాలోనూ.. జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఇప్పుడే ఎన్నిక‌లు వ‌చ్చేసిన‌ట్టుగా, వైసీపీని గ‌ద్దెదించేయ‌డానికి ప్ర‌జ‌లు సిద్ధ‌మైపోవాల‌న్న‌ట్టుగా ప‌రిస్థితి మారిపోయింది.

మ‌రి నిజానికి రాష్ట్రంలో ఆ ప‌రిస్థితి ఉందా? అంటే లేద‌నే చెప్పాలి. ఎందుకంటే.. ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉంది. పైగా.. ఒక ఏడాది పూర్తిగా ప్ర‌భుత్వ పాల‌న‌కు , అనేక మార్పుల‌కు కూడా అవ‌కాశం ఉంది.

ఈలోగా ఏదైనా కార‌ణంగా ఉప ఎన్నిక వ‌చ్చినా వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. కానీ, ఇంత‌లోనే క‌ర్నూలులో జ‌రిగిన ఘ‌ట‌నల నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఫ్రెస్ట్రేష‌న్‌కు గుర‌య్యారు. పైకితాను అలాంటిదేమీ లేద‌ని.. అంటున్నారు. కానీ, ఉంది. క‌ర్నూలులో హైకోర్టు కోసం అక్క‌డి న్యాయ వాదులు.. ప్ర‌జ‌లు కూడా చంద్ర‌బాబును అడ్డ‌గించారు. ఇది స‌హ‌జంగానేచంద్ర‌బాబుకు కోపం తెప్పించింది. అయితే, ఆయ‌న సంయ‌మ‌నంతో ఉంటే ఈ స‌మ‌స్య వ‌చ్చేది కాదు.

ఆయ‌న ఆ ఆందోళ‌న‌ల‌ను సానుకూలంగా చూడ‌లేక పోయారు. ఇక్క‌డే త‌డ‌బ‌డిపోయారు. గ‌తంలో జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన‌ప్పుడు కాపులు కూడా త‌మ రిజ‌ర్వేష‌న్‌కోసం.. తూర్పుగోదావ‌రిలో ఆయ‌న పాద‌యాత్ర‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. అప్ప‌ట్లో జ‌గ‌న్ ఆవేశ ప‌డలేదు. త‌న నిర్ణ‌యాన్ని నిష్క‌ర్ష‌గా వెల్ల‌డించారు. వ‌స్తేరానీ, పోతేపోనీ అన్న‌ట్టుగా కాపుల‌కు నేనేమీ చేయ‌లేన‌న్నారు.

కానీ, క‌ర్నూలులో హైకోర్టు కోసం.. న్యాయ‌వాదులు ఉద్య‌మించి.. కాన్వాయ్‌కు అడ్డుత‌గిలిన‌ప్పుడు చంద్ర‌బాబు ఇలా చెప్ప‌లేక పోవ‌డంతోనే స‌మ‌స్య వ‌చ్చింది. ఏదేమైనా.. అల‌జ‌డికి ఇది స‌మ‌యం కాదు. ఎన్నిక‌ల‌కు కూడా ఇంకా స‌మ‌యం ఉంది. సో.. ఆచితూచి అడుగులు వేస్తేనే అనుకున్న‌ది సాధించ‌గ‌ల‌ర‌నే విష‌యాన్ని చంద్ర‌బాబు గుర్తించిముందుకు సాగాల్సి ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.