Begin typing your search above and press return to search.
టీ హోంమంత్రి పేషీలో మరోసారి అదే సీన్.. ఈసారి ఏం జరుగుతుందో?
By: Tupaki Desk | 3 May 2021 12:30 AM GMTఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రి పదవి అంటే.. దాని తీరే వేరు అన్నట్లు ఉండేది. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి పదవికి పూర్తి అర్హుడైనప్పటికీ.. సమీకరణాలు కుదరని సీనియర్ నేతకు హోంమంత్రి పదవిని అప్పజెప్పేవారు. కాలక్రమంలో ఆ పదవిలో ఎలాంటి నేతల్ని ఎంపిక చేస్తున్నారో గడిచిన కొద్దికాలంగా చూస్తున్నదే. గతంలో హోంమంత్రి కిందనే పోలీస్ శాఖ ఉండేది. ఇప్పుడు పేరుకు హోంమంత్రి ఉన్నా.. నిర్ణయాధికారం.. పోలీసుల మీద పెత్తనం మొత్తం ముఖ్యమంత్రి మీదనే ఉంటుందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఈ మధ్యన ఎక్కువైందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తుంటారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పేషీకి సంబంధించి ఆసక్తికర అంశాలు తరచు బయటకు వస్తుంటాయి. ఆయన పేషీకి చెందిన కొందరు సిబ్బంది చేష్టలు షాకింగ్ గా వినిపిస్తుంటాయి. తమకున్న పలుకుబడితో వారు చేసే చేష్టలు హోంమంత్రికి చెడ్డపేరు తెచ్చేలా ఉంటాయని చెబుతారు. ఈ మధ్యనే హోంమంత్రి బంధువులమన్న పేరుతో కొందరు భూదందాలు చేస్తున్నారు.
ఇలాంటి వారిపై కంప్లైంట్ చేయటానికి కొందరు బాధితులు పేషీకి వచ్చారు. అలా వచ్చిన వారికి న్యాయం చేస్తామంటూ అక్కడున్న సిబ్బంది అందినకాడికి దండుకున్న వైనం బయటకు రావటం.. ఇది కాస్తా సంచలనంగా మారటం జరిగింది. ఈ ఉదంతంపై నిఘా విభాగం ఫోకస్ చేసింది. హోంమంత్రి వద్ద పీఏగా వ్యవహరిస్తున్న జానీమియా వ్యక్తిని బాధ్యతల నుంచి తాజాగా తప్పించారు. అయితే.. ఇతని మీద గతంలోనూ ఆరోపణలు రావటం.. తొలగించటం జరిగినట్లు తెలుస్తోంది.
గతంలో రెండుసార్లు తొలగించటం.. ఆ తర్వాత అతను మళ్లీ పేషీలోకి వచ్చి చేరటం మామూలేనన్న మాట కొందరి నోట వినిపిస్తూ ఉంటుంది. తాజా ఎపిసోడ్ లో మాత్రం సీరియస్ అయిన హోంమంత్రి.. సదరు వ్యక్తిని.. మరో ఇద్దరు అనధికార సిబ్బందిని తన ఆఫీసులోకి అడుగు పెట్టొద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి.. ఈ ఆగ్రహం ఎంతకాలం ఉంటుందో ఏమో?