Begin typing your search above and press return to search.
బీజేపీలో ఏం జరుగుతోంది : ఇచ్చట ప్రధాని పదవి ఖాళీ లేదు...?
By: Tupaki Desk | 2 Aug 2022 1:30 PM GMTదేశంలో కుర్చీలు ఎపుడూ ఖాళీగా ఉండవు. వారిని బలవంతంగా ఖాళీ చేయిస్తారు. దానికి జనాల మద్దతు కూడగడతారు. అలా ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమించి జనం మద్దతు దక్కించుకుని కుర్చీలను ఎక్కేవారిని నాయకులు అంటారు. అలా ఇప్పటికి రెండు విడతలుగా దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించిన నరేంద్ర మోడీ హ్యాట్రిక్ వీరుడు కావాలని చూస్తున్నారు. 2024లో జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ బీజేపీదే విజయం అని ఒక జాతీయ చానల్ సర్వే చేసి బయటపెట్టింది. దాంతో కమలనాధులలో ఉత్సాహం పొంగిపొరలుతోంది.
ఆ విషయం అలా ఉంచితే ఈ మధ్య జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీజేపీ నిలబెట్టిన అభ్యర్ధి ఘన విజయం సాధించారు. ఇక విపక్ష శిబిరం చూస్తే కకావికలైంది. ఒక రాజకీయ వ్యూహం అన్నది లేకుండా నిస్సహాయంగా ఎలా ఉంది అన్నదే తెలియచేస్తోంది. ఈ నేపధ్యంలో నుంచి చూస్తే బీజేపీకి ఎదురులేదు అన్న భావన రాజకీయ వర్గాలలోనే కాదు సగటు జనాలలో కూడా ఎంతో కొంత ఉంది.
ఇక మళ్లీ ఎన్నికలు జరిగితే మోడీ మూడవసారి ప్రధాని అవడం ఖాయమని భావిస్తున్నారు. కానీ బీజేపీలో చూస్తే సీన్ అలా లేదు. ప్రధాని పదవికి పోటీ చాలా గట్టిగానే ఉంది. సీనియర్ మంత్రి, ఆరెస్సెస్ కి దగ్గరవాడు అయిన నితీన్ గడ్కరీ నుంచి మోడీకి తీవ్రమైన పోటీ ఈసారి ఎదురుకావచ్చు అని అంటున్నారు. అలాగే యూపీలో రెండు సార్లు గెలిచి ఘనమైన సీఎం గా ఉన్న యోగీ ఆదిత్యనాధ్ కూడా రేసులో ముందుకు వస్తున్నారు. మరి కొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వారిలో సీనియర్లు ఉన్నారు.
ఈ సమయంలో మోడీయే మన ప్రధాని అభ్యర్ధి, ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదు అంటూ అమిత్ షా తాజాగా చేసిన ప్రకటన సంచలనమే నమోదు చేసింది. నిజానికి ఇది సందర్భం అయితే కానే కాదు, ఇంకా ఎన్నికలకు చాలా దూరం ఉంది. బీజేపీలో ఇలాంటి ప్రకటనలు చేయడం వ్యక్తిగత స్థాయిలో కూడా సాధ్యపడదు, పార్లమెంటరీ బోర్డు డిసైడ్ చేస్తుంది. అయితే అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో నడిపిస్తూ చక్రం తిప్పుతున్న మోడీ అమిత్ షాలకు జాతీయ బోర్డు అన్నది కూడా ఒక లాంచనమే అనుకోవాలి.
అందుకే చాలా ఉత్సాహం చూపించి మోడీయే మా ప్రధాని క్యాండిడేట్ అని అమిత్ షా చెప్పుకొచ్చారు. దీని వెనక పక్కా వ్యూహం ఉంది. విపక్షల కోసం చేసిన ప్రకటన ఇది అంతకంటే కాదు అని కూడా తెలుస్తోంది. బీజేపీలో ఉన్న ప్రధాని పోటీదారులకు గట్టి సందేశం వినిపించాలన్న ఉద్దేశ్యంతోనే అమిత్ షా ఇలా ప్రకటించారని అంటున్నారు. ఆయన వెనక మోడీ ఉన్నారని కూడా చెబుతున్నారు.
మరో ఇరవై నెలలు చేతిలో అధికారంలో ఉంచుకుని మోడీ మూడవసారి నేనే అని చెప్పుకోవడం అంటే అది అతి ఉత్సాహమే అవుతుంది. అందువల్ల కాగల కార్యాన్ని అలా అమిత్ షాతో నెరవేర్చారు అని అంటున్నారు. ఇక్కడ మరో విషయం ఉంది. క్యాడర్ కి కూడా ఇదే సందేశం. బీజేపీ అంటే మోడీ ఆయన వెనక షా తప్ప మరొకరు కాదు అని చెప్పడం అన్న మాట. ఇక బీజేపీలోని ఆశావహులకు నో చాన్స్ ని చెప్పడానికి కూడా ఈ ప్రకటనను వాడుకుంటున్నారు అనుకోవచ్చు.
మొత్తం మీద బీజేపీలో ప్రధాని పదవికి పోటీ అన్నది ఉండరాదు, అలాంటి ఊహాగానాలకు తావు ఇవ్వరాదు అన్న విధంగా మోడీ షా తెలివిగా ఈ వ్యూహం పన్నారని అంటున్నారు. మరో వైపు చూస్తే ప్రధాని పదవి అన్నది మోడీ షాల మధ్యనే ఉండాలి తప్ప మిగిలిన నాయకుల మధ్యన అసలు కాదు వారిని లెక్క తీయడానికి లేదు అన్న అద్భుతమైన సందేశం వినిపించేందుకే ఈ అర్జంటు స్టేట్మెంట్ అంటున్నారు.
మోడీ మూడవసారి ప్రధాని అయితే ఆయన చేయగలిగినన్నాళ్ళు చేసిన మీదటన తదుపరి ప్రధాని అయ్యేది అమిత్ షాయే అని కూడా చెబుతున్నారు. ఈ ఇద్దరు మిత్రుల బంధంతో రాజకీయ పందెంతో బీజేపీ ప్రధాని పదవిని తమ వాకిట కట్టేసుకున్నారని కమలదళం ఇపుడు కుమిలినా ప్రయోజనం లేదు. ఎందుకంటే పార్టీ ఎపుడో ఈ ఇద్దరితోనే అన్నట్లుగా ఉంది కనుక.