Begin typing your search above and press return to search.
వైఎస్ లో ఉన్నది.. బాబులో లేనిది సింఫుల్ గా చెప్పేశారుగా?
By: Tupaki Desk | 21 March 2021 5:30 PM GMTనల్లదొరల ఏలుబడిలో ఏ వ్యవస్థను.. ఏ రీతిలో నిర్వీర్యం చేయాలన్న విషయాన్ని ఇప్పటికే చేతల్లో చేసి చూపించారు. ఈ విషయంలో మరీ మొండిగా వ్యవహరిస్తే మొదటికే మోసం వచ్చే పరిస్థితి.
కాలం మారుతున్న కొద్దీ.. తెగించే వారి కంటే.. రాజీ పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తప్పును తప్పుగా ఎత్తి చూపే ధైర్యం.. సాహసం ఉండటం లేదు. గతంలోని విలువల్ని మర్చిపోయిన ఈ తరం.. తాము నమ్మిన దాని గురించి మాత్రం గొప్పగా కీర్తించటం కొంత వరకు బాగానే ఉన్నా.. ఇటీవల కాలంలో అది మరింతగా ముదిరిపోయింది. ఏం జరిగినా.. ఏం చేసినా.. తాము మద్దతు పలికే వారిని నెత్తికి ఎక్కించుకోవటం.. వారి గురించి ఒక్క మాట అంటే సహించలేదనంతగా కనెక్టు కావటం కనిపిస్తుంది. ఇలాంటివేళలో.. మీడియా మాత్రం శ్రీరామచంద్రుడిలా ఉండాలని కోరుకోవటం అత్యాశే అవుతుంది.
అయినప్పటికీ.. ఇప్పటి పరిస్థితుల్లో అంతో ఇంతో నిజాల్ని నిర్భయంగా.. మొహమాటాలు లేకుండా చెప్పే మీడియా సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి. జెండాలు.. ఎజెండాల సంగతి పక్కన పెడితే.. కొన్ని విషయాల్ని ఓపెన్ గా మాట్లాడే విషయంలో ఆపత్రికకు..దాని యజమానికి పెద్ద మొహమాటాలకు పోరు. తాను అమితంగా అభిమానించే చంద్రబాబు చేసే తప్పుల్ని.. ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే (రాధాక్రిష్ణ) చెప్పినంత సులువుగా మరెవరూ చెప్పలేరేమో? వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం.. వ్యక్తిగతంగా చాలా విషయాలు తెలిసిన నేపథ్యంలో.. బాబుపై ఆర్కే చేసే విమర్శలు అర్థవంతంగానే కాదు.. వంద శాతం నమ్మగలిగే పరిస్థితి.
ప్రతి వారంతంలో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి తన కాలమ్ లో ప్రత్యేకంగా ప్రస్తావించే ఆర్కే.. తాజాగా కొన్ని ఆసక్తికర అంశాల్నిప్రస్తావించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో ఉన్న గుణం.. ప్రస్తుత ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడిలో లేదని కుండబద్దలుకొట్టేయటమే కాదు.. వైఎస్ మాదిరి చంద్రబాబు చేయలేకపోవటం కూడా ఆయన వైఫల్యాలకు కారణంగా విశ్లేషించారు. ఇంతకీ ఆయన ఏమంటారు? వైఎస్ కు బాబుకు మధ్య ఉన్న వైరుధ్యాలేమిటి? అన్నది ఆయన అక్షరాల్లోనే చూస్తే..
‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి తన అనుచరుడైన గౌరు వెంకటరెడ్డిని జైలుకు వెళ్లి మరీ పరామర్శించారు. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న వారిని పరామర్శించే సాహసం చంద్రబాబు చేయగలరా? ఆనాడు రాజశేఖర్ రెడ్డి చేసిన పని వల్ల నమ్ముకున్న వాళ్ల కోసం ఆయన ఎంత వరకైనా వెళతారన్న పేరొచ్చింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు’’
‘‘అంతెందుకు, జగన్ రెడ్డి విషయమే తీసుకుందాం. కేంద్రంలో అధికారం చలాయిస్తూ అత్యంత బలమైన నాయకురాలిగా చలామణి అవుతున్న సోనియాగాంధీని ధిక్కరించి సొంత పార్టీ పెట్టుకొని జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడని కారణంగానే జగన్‌కు జనంలో క్రేజ్ ఏర్పడింది. గతంతో పోల్చితే ఇప్పుడు రాజకీయాల్లో కొలమానాలు మారిపోయాయి. చంద్రబాబు ఇంకా పాత విధానాలను, విలువలను పట్టుకొని వేలాడుతున్నారు’’
‘‘ఒకప్పుడు వాహినీ వారి చిత్రాలలో పెద్దమనుషుల రూపంలో విలనిజం చూశాం. ఇప్పుడు భయంకరమైన విలన్ పాత్రలు పోషించేవారికి అదే స్థాయిలో క్రేజ్ ఉంటోంది. ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలు మారిపోయాయి. నాయకులు ఆ మేరకు మారకపోతే కనుమరుగవుతారు. ఇప్పుడు చంద్రబాబు ప్రదర్శించాల్సింది దృఢత్వం. ఎన్టీఆర్ వేసిన పునాది పుణ్యమా అని తెలుగుదేశం పార్టీ దాదాపు నాలుగు దశాబ్దాలు నిలబడింది. ఇప్పటి తరాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఆ పునాదులను పటిష్ఠం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటే మరో మూడు నాలుగు దశాబ్దాల పాటు పార్టీ నిలబడుతుంది’’
‘‘పార్టీ గురించి ఆలోచించని వారినీ, తనపట్ల కనీసం గౌరవం కూడా లేనివారిని ఇంకెంత కాలం మోస్తారు? పార్టీకి ఇప్పుడు కొత్త రక్తం అవసరం. చంద్రబాబు నాయకత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోలేదు. రాజకీయాలను విస్మరించిన కారణంగానే తనకు వ్యతిరేకంగా జరిగిన ప్రచారాన్ని ఆయన పట్టించుకోలేదు. ఫలితంగా ఇంతకు ముందెన్నడూ జరగని విధంగా ఆయనపై కుల ముద్ర వేయగలిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సైకాలజీని అర్థం చేసుకోవడంలో కూడా చంద్రబాబు విఫలమయ్యారు’’
‘‘ఇంతకుముందే చెప్పుకున్నట్టు స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికలు, ఉప ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో జరిగే సాధారణ ఎన్నికలకు గీటురాయి కాదు. జయలలిత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికలే కాదు, ఉప ఎన్నికల్లో కూడా పోటీ చెయ్యలేదు. సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబుతో పాటు తెలుగుదేశం నాయకులు ఆత్మపరిశీలన చేసుకొని తమను తాము సరిదిద్దుకోవడం తక్షణ అవసరం. వాడుకుని వదిలేస్తారు అన్న అపవాదు మోసుకుంటూ గడిపే నాయకులకు ఒడిదుడుకులు తప్పవు. తెలుగుదేశం పార్టీ నాయకులు పై నుంచి కింది వరకు లోపాలను సరిదిద్దుకొని కలసికట్టుగా ముందుకు వెళితే భవిష్యత్తు ఉండకపోదు’’