Begin typing your search above and press return to search.
ముందస్తుపై జగన్ వ్యూహం ఏంటి? ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఎప్పుడు?
By: Tupaki Desk | 12 Dec 2022 4:06 AM GMTఏపీలో వైసీపీ ప్రభుత్వం అప్పులతో సతమతం అవుతోంది. అదేసమయంలో అభివృద్ధి లేదనే టాక్ కూడా జోరుగానే వినిపిస్తోం ది. ఏరోజుకారోజు.. అన్నట్టుగా అప్పులు చేస్తున్నారు. అదేసమయంలో రహదారులపై గుంతలు కూడా పూడ్చ లేకపోతున్నారు. దీనిపై ప్రజల్లో చర్చ సాగుతోంది. మరోవైపు.. ఇవే అంశాలను ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యతిరేకత పెరగకముందే.. తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే.. ముందస్తు మంత్రం తప్పదనే చర్చ సాగుతోంది.
అయితే.. వైసీపీ ప్రభుత్వం మాత్రం ముందస్తు లేదని చెబుతోంది. కానీ,పరిణామాలను గమనిస్తే.. మాత్రం ముందస్తు ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ జగన్ ముందస్తుకు వెళ్తే.. ఎప్పుడు అవకాశం ఉంటుందనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం 18 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉంటాయి. వీటి వరకు ఆగే అవకాశం లేకపోతే.. ముందస్తుకు వెళ్లే ఛాన్సును తొసిపుచ్చలేం. ఈ విషయాన్ని పరిశీలిస్తే.. జగన్ ముందున్న అవకాశం ఏంటంటే..
జనవరి-ఫిబ్రవరి 2023 మధ్య రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయి. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికలు ముగియగానే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుంది. వీటిలో గెలిచి(నయానో భయానో) ప్రజలు తమవైపే ఉన్నారని చెబుతూ.. ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుంది.
ఒకవేళ అది కాదంటే.. మార్చి-మే నెలల్లో ఇవ్వాల్సిన సంక్షేమం ఇచ్చేసి.. అప్పుడు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయి. అయితే, ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. ముందస్తుకు వెళ్తే.. ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల మాండేట్‌లో దాదాపు ఏడాది కాలాన్ని జగన్ వదులుకోవాల్సి ఉంటుంది.
ఇక, అదేసమయంలో కొత్త అప్పులు పుట్టేందుకు ఏప్రిల్‌లో కేంద్రం రివిజన్‌కు రాష్ట్రాలకు అవకాశం ఇస్తుంది. సో.. ఆ అప్పులు తీసుకుని సంక్షేమ పథకాలు ఇచ్చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లడం కూడా వృథానే అవుతుంది. సో.. దీనిపైనా చర్చసాగుతోంది.
ఆర్ధిక సంవత్సరం తొలి మూడు నెలలలో.. ఏడాది అప్పుల లిమిట్ మొత్తం అందినకాడికి తీసేసుకొని కొంత జులైలో పంచేసి .. ఆగస్టు చివరకి ఎలక్షన్స్ కి వెళటం కూడా ఒక విధానం. అయితే.. అప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసినా.. అదే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలతో కలిపి ఏపీకి ఎన్నికలు అంటే.. ఇబ్బంది తప్పదు. ఎందుకంటే.. మూడు ఈశాన్య రాష్ట్రాలకు నవంబరు-డిసెంబరు మధ్య ఎన్నికలు ఉన్నాయి. సో.. అప్పటి వరకు ఆపినా ఆపే అవకాశం ఉంటుంది కాబట్టి ఇబ్బంది తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవన్నీ కూడా వదులుకుని బండిని లాగించినా.. నవంబరు - డిసెంబరు నాటికి అప్పులు పుట్టక మళ్లీ ఇబ్బందులు తప్పవు. అదీకాక.. తెలంగాణ ఎన్నికలు వచ్చేస్తాయి. అప్పుడు అసలు ముందస్తుకు వెళ్లినా ప్రయోజనం ఉండే అవకాశం లేదు. దీంతో 2024 ఎన్నికలే బెటర్ అనుకునే పరిస్థితి ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.