Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ అంటే ఏమిటి? ఏం జరుగుతుంది?
By: Tupaki Desk | 23 March 2020 6:00 AM GMTకరోనా వేళ మార్చి నెలాఖరు వరకు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటం తెలిసిందే. దీనికి తగ్గట్లు 1897లో రూపొందించిన అంటువ్యాధుల చట్టంలోని సెక్షన్ 2,3,4 ప్రకారం కఠినమైన నిబంధనల్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇంతకీ లాక్ డౌన్ అంటే ఏమిటి? అప్పుడెప్పుడో 124 ఏళ్ల క్రితం తయారు చేసిన చట్టంలో దీనికి సంబంధించి ఏం చెప్పి ఉంది? అన్న విషయాల్ని చూస్తే..
గాలి ద్వారా.. లేదా మనిషి నుంచి మనిషికి వ్యాధి సోకకుండా నియంత్రించేందుకు అత్యవసరం మినహా సకల వ్యవస్థల్ని దిగ్బంధించే ప్రయత్నాన్నే లాక్ డౌన్ గా వ్యవహరిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ చట్టాన్ని అమలు చేస్తుంటే.. ఏపీలో మాత్రం కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందన్న అనుమానాలు ఉన్న జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్న జిల్లాల్లో లాక్ డౌన్ అమలు చేయాలని పేర్కొంది. ఇందులో భాగంగా ఏపీలోని నెల్లూరు.. ప్రకాశం.. గుంటూరు.. కృష్ణా.. ఉభయ గోదావరి జిల్లాలు.. విశాఖ.. కడప.. చిత్తూరు.. అనంతపురం జిల్లాల్లో లాక్ డౌన్ చేసే అవకాశం ఉంది.
లాక్ డౌన్ వేళ ఏం చేస్తారన్న విషయంలోకి వెళితే.. ఈ సమయంలో ప్రజా రవాణాను నిలిపివేస్తారు. టాక్సీలు.. ఆటోలు తిరగనివ్వరు. అత్యవసర రవాణాకు (గర్బిణిల తరలింపు.. వైద్య ఆరోగ్య సేవల కోసం.. నిత్యవసర వస్తువులు.. ఫార్మా రంగానికి చెందిన వస్తువల రవాణా) ఓకే చెబుతారు. అంబులెన్స్ లు..పోలీసుల వాహనాలతో పాటు మీడియాకు చెందిన వాహనాల్ని అనుమతిస్తారు.
నిత్యవసర వస్తువుల కేటగిరిలో రాని దుకాణాలు.. వాణిజ్య సముదాయాలు.. షాపింగ్ కాంప్లెక్సులు.. ఆఫీసులు.. ఫ్యాక్టరీలు.. వర్క్ షాపులు.. గోదాముల్ని మూసివేస్తారు. విదేశాల నుంచి వచ్చిన వారు విధిగా జిల్లా కలెక్టర్ ఇచ్చే నోటిఫికేషన్ కు కట్టుబడి ఇంట్లోనే ఉండిపోవాలి. విదేశాల నుంచి వచ్చే వారిని గుర్తించేందుకు.. వారి సంరక్షణ చర్యలకు వీలుగా వారిపై నిరంతరం పోలీసుల నిఘా.. నియంత్రణ కొనసాగుతుంది.
అంటువ్యాధిని నియంత్రించేందుకు వీలుగా ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలి. అత్యవసరం అయితే తప్పించి ఇంట్లో నుంచి బయటకు రాకూడదు. ఒకరికి ఒకరికి మధ్య దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ వంద పడకల సామర్థ్యం ఉన్న క్వారంటైన్ కేంద్రాల్ని నెలకొల్పాలి. దీనిపై ఆయా జిల్లా కలెక్టర్లు తగిన ఆదేశాలు ఇవ్వాలి. ప్రతి జిల్లా ప్రధాన కేంద్రంలోనూ కోవిడ్ 19చికిత్స కోసం 200-300 పడకల సామర్థ్యం ఉన్న ఆసుపత్రుల్ని సిద్ధం చేస్తారు. బోధనాసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. నిత్యవసర వస్తువుల ధరల్ని.. మందుల ధరల్ని ప్రకటించి.. ఎప్పటికప్పుడు వాటిని అమలు చేయటంతో పాటు.. పర్యవేక్షిస్తుంటారు. అత్యధిక ధరలకు వస్తువుల్ని అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురుకు మించిన చేరి ఉండటంపై ఆంక్షలు ఉంటాయి.