Begin typing your search above and press return to search.
కశ్మీర్ కొలిక్కి వచ్చింది.. మోదీ నెక్స్ట్ టార్గెట్ ఆ రెండేనా?
By: Tupaki Desk | 5 Aug 2019 11:20 AM GMTజమ్ముకశ్మీర్ రాష్ట్ర విభజన, తత్ఫలితంగా ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ సమస్య చాలావరకు కొలిక్కి వచ్చింది. దీనికి కొనసాగింపుగా మోదీ వేయబోడే తదుపరి అడుగులు ఏమిటన్న విషయంలోనూ రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా రాజకీయవర్గాల్లో ఊహాగానాలతో పాటు అందుకు ఊతమిచ్చే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.
తాజాగా రాజ్యసభలో అమిత్ షా ప్రవేశపెట్టిన బిల్లులతో దాన్ని సమర్థించినవారంతా అఖండ భారత్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అఖండ భారతావని మోదీతోనే సాధ్యమంటూ మిత్ర పక్షాలూ, హిందూత్వ వాదులు ఆయన్ను కీర్తిస్తున్నారు. ఈ క్రమంలో కశ్మీర్ సమస్యను కొలిక్కి తెచ్చిన తరువాత మోదీ ఏం చేయబోతున్నారు.. ఎలాంటి అడుగులు వేయబోతున్నారన్నది చర్చనీయంగా మారింది. ముఖ్యంగా తదుపరి అడుగు పీవోకేపై పడుతుందని అంచనాలు వేస్తున్నారు. పాక్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడం మోదీ నెక్స్ట్ టార్గెట్ అని తెలుస్తోంది. దీంతో పాటు బలూచిస్తాన్ కు పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కల్పించడం కూడా మోదీ నెక్స్ట్ టార్గెట్ అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇందుకు తగ్గట్లుగానే రాజ్యసభలో ఈ రోజు బిల్లుపై చర్చ సందర్భంగా శివసేన ఎంపీ చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాలతో ప్రధాని మోదీ భారతావని మొత్తాన్నీ ఏకం చేశారంటూ కీర్తించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అక్కడితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి ఇదే ఊపులో పాక్ ఆక్రమిత కశ్మీర్, బలూచిస్తాన్‌లనూ కలిపేయాలని అన్నారు. బీజేపీకి మంచి మిత్రపక్షమైన శివసేన నుంచి వచ్చిన ఈ మాటలు కొట్టిపారేసేవి కావని.. నిప్పులేనిదే పొగరాదని భావిస్తున్నారు. మోదీ తదుపరి లక్ష్యాలు ఇవే కావొచ్చని రాజకీయ వర్గాల నుంచి అంచనాలు వినిపిస్తున్నాయి.