Begin typing your search above and press return to search.
రోహిత్ ఏంటిది? నువ్వేనా ఆ షాట్ ఆడింది..! హిట్‌మ్యాన్ ఆటపై తీవ్ర విమర్శలు
By: Tupaki Desk | 16 Jan 2021 1:30 PM GMTఆస్ట్రేలియా టూర్లో టెస్ట్క్రికెట్ ఆడుతున్న రోహిత్‌శర్మపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. చివరి టెస్ట్‌లో రోహిత్ అనవసర షాట్ ఆడాడంటూ అతడిపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే సోషల్‌మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. మరోవైపు సీనియర్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా రోహిత్ ఆటతీరుపై విమర్శలు గుప్పించారు. ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌లో రోహిత్ ఓ నిర్లక్ష్యపు షాట్ ఆడి వికెట్ కోల్పోయాడు.
ఆటలో రెండో రోజైన శనివారం స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో హిట్‌మాన్ క్రీజ్‌లో ఉన్నాడు. అప్పటికే 74 బంతుల్లో 44 పరుగులు చేశారు. నాలుగు ఫోర్లు కొట్టాడు. అయితే లయన్ వేసిన ఓ బంతిని భారీ షాట్ ఆడబోయి క్యాచ్ అవుట్ అయ్యాడు. రోహిత్ కొట్టిన బంతి లాంగాన్‌లో ఫీల్డర్ మిచెల్ స్టార్క్ చేతికి చిక్కింది.
రోహిత్ శర్మ షాట్ పై సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. 'రోహిత్ ఎందుకలా ఆడాడో నేను ఊహించలేకపోయా. అది బాధ్యతారాహిత్యమైన షాట్. రోహిత్ క్రీజ్‌లో ఉన్నప్పుడు లాంగాన్‌లో ఫీల్డర్ ఉన్నాడు. డీప్ స్క్వయర్ లెగ్‌లోనూ ఓ ఫీల్డర్ ఉన్నాడు. అటువంటప్పుడు రోహిత్ ఆ షాట్ ఆడి ఉండాల్సింది కాదు. పరుగుల కోసమా.. ఆ షాట్‌కి రెండు బంతుల ముందు ఒక బౌండరీని రోహిత్ శర్మ సాధించాడు. ఆ తర్వాత కూడా అతడు ఎందుకంత తాపత్రయపడ్డాడో. రోహిత్ నుంచి ఆ షాట్ నేను ఊహించలేదు. అతడో సీనియర్ క్రికెటర్. ఎన్నో మెరుగైన ఇన్సింగ్స్ ఆడాడు’ అంటూ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.