Begin typing your search above and press return to search.

'మహా' ట్విస్ట్ లో శరద్ పవార్ పాత్ర ఎంత?

By:  Tupaki Desk   |   23 Nov 2019 2:24 PM GMT
మహా ట్విస్ట్ లో శరద్ పవార్ పాత్ర ఎంత?
X
అధికారమనే చదరంగం లో నేతలు పావులే.. కేంద్రంలో అధికారం లో ఉన్న నరేంద్రమోడీ విసిరిన పాచికలో ఇప్పుడు కురు వృద్ధుడు శరద్ పవార్ పావు గా మారాడా అన్న సందేహాలు కాంగ్రెస్, శివసేన వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. శరద్ పవార్ కు తెలియకుండానే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, అన్న కొడుకు బీజేపీ తో కలిసి పోయారా అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల రాజ్యసభ 250 సెషన్ సందర్భం గా ప్రధాని నరేంద్రమోడీ కురు వృద్ధుడైన రాజకీయ నేత, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను ఆకాశానికెత్తేశాడు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని సాన్నిహిత్యంగా ఉండే శరద్ ను కీర్తించడం వెనుక 'మహారాష్ట్ర అనిశ్చితి' ఉందని అంతా డౌట్ పడ్డారు.

అనుకున్నట్టే నరేంద్ర మోడీ మెచ్చుకున్న మూడు రోజులకే శరద్ పవార్ ప్రధాని నరేంద్రమోడీ ని కలిసి చర్చలు జరిపారు. మహారాష్ట్ర రైతుల గురించే చర్చించామన్నారు. కానీ అంతకుమించిన ప్లానేదో వేశారని అప్పుడే డౌట్స్ వచ్చాయి.

ఇక తాజాగా శరద్ పవార్ పార్టీ చీలి పోయింది. ఆయన అన్న కొడుకు అజిత్ పవార్, ఎన్సీపీ ఎమ్మెల్యేలు బీజేపీ కి మద్దతిస్తూ లేఖ రాసి మహారాష్ట్ర ప్రభుత్వం లో చేరిపోయారు. దీనిపై శరద్ పవార్ స్పందించారు. అజిత్ పవార్ బీజేపీ తో కలుస్తున్నాడని తనకు తెలియదని.. ఉదయమే తెలిసిందంటూ లైట్ తీసుకున్నారు. అజిత్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కానీ ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. ఇక బీజేపీ కి జై కొట్టిన ఎమ్మెల్యేల ను ఏమీ అనలేదు..

ఇలా శరద్ పవార్ ఈ ఎపిసోడ్ లో ఇన్ డైరెక్టు గా తన అన్న కొడుకు అజిత్ పవార్ ద్వారా చక్రం తిప్పి తమను మోసం చేశాడని శివసేన, కాంగ్రెస్ అనుమానిస్తోంది. తమతో ఉంటూనే శరద్ పవార్ డబుల్ గేమ్ ఆడారని ఆరోపిస్తున్నాయి. మరి ఈ ఆరోపణలపై శరద్ పవార్ ఏ విధంగా స్పందిస్తారనేది వేచిచూడాలి.