Begin typing your search above and press return to search.

సూయజ్ కు ప్రత్యామ్నాయం ఏంటి .. 1963 అమెరికా నివేదిక ఏం చెప్పింది ?

By:  Tupaki Desk   |   31 March 2021 12:30 AM GMT
సూయజ్ కు ప్రత్యామ్నాయం ఏంటి .. 1963 అమెరికా నివేదిక ఏం చెప్పింది ?
X
సూయజ్ కాలువ .. గత వారం రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోతుంది. దీనికి ప్రధాన కారణం ఈ సూయజ్ కాలువ లో దాదాపు వారం పాటు అడ్డంగా ఇరుక్కుపోయింది 'ఎవర్ గివెన్' నౌక. ప్రస్తుతానికి అతి కష్టం మీద ఆ నౌకను అయితే పక్కకి తీశారు. వాణిజ్యానికి లైన్ క్లియర్ చేసింది. ఈ వారం రోజులూ ప్రపంచ వాణిజ్యానికి కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. రెండు సముద్రాలను, రెండు ప్రపంచాలను కలిపే ఓ చిన్న కాలువ పెద్ద సమస్యను సృష్టించింది. దీనితో ఆ సూయజ్ కాలువకి ప్రత్యామ్నాయాలపైనా చర్చ నడిచింది. అయితే, ఈ చర్చే నాలుగు దశాబ్దాల క్రితమూ జరిగింది.

అప్పట్లో మిత్రదేశాలైన ఈజిప్ట్, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు దెబ్బతిని యుద్ధం జరగడం, కొన్నేళ్ల పాటు సూయజ్ కాలువ మార్గం మూతపడడంతో అమెరికా ప్రత్యామ్నాయ కాలువపై దృష్టి పెట్టింది. ఇజ్రాయెల్ లోని నెగెవా ఎడారిలో మధ్యదరా, ఎర్రసముద్రం, హిందూ సముద్రాలను కలుపుతూ పెద్ద కాలువ నిర్మించాలని 1963లో లివ్ మోర్ ఓ నివేదికను తయారు చేసింది. అందుకు అణు పేలుడు పదార్థాలను వాడాలని ప్రతిపాదించింది. 520 అణు పేలుడు పదార్థాలను పేల్చి 1,500 అడుగుల లోతుతో 160 మైళ్ల పొడవున (దాదాపు 257 కిలోమీటర్లు) కాలువను నిర్మించాలనుకుంది. దానికి మొత్తం కాలువ పొడవులో మైలు కు నాలుగు అణు పేలుడు పదార్థాలను చొప్పున 130 మైళ్ల (209 కిలోమీటర్లు) పొడవున మొత్తం 520 అణు పేలుడు పదార్థాలను పెట్టాలని ప్రతిపాదించింది. కాలువ వెడల్పు వెయ్యి అడుగులు వచ్చేలా 1,300 అడుగుల లోతులో ఒక్కొక్కటి 2 టన్నుల బరువైన పేలుడు పదార్థాలను పాతిపెట్టి పేలుళ్లు జరపాలని ప్రతిపాదించింది. ఆ కాలంలో అంత పొడవైన కాలువకు 57.5 కోట్ల డాలర్లు ఖర్చవుతుందని పేర్కొంది. అయితే, దాదాపుగా 27 ప్రయోగాలు చేసిన తరువాత ఈ ప్రతిపాదనను అమెరికా పక్కన పెట్టింది. ఒకవేళ భారీ స్థాయిలో అణుబాంబులు పేల్చడం ద్వారా భూమి అత్యధిక రేడియేషన్ ఏర్పడుతుందని గ్రహించిన అమెరికా 1974 లో దీనిని పక్కన పెట్టింది. అయితే తాజాగా సూయజ్ కాలువ లో'ఎవర్ గివెన్' నౌక అడ్డంగా చిక్కుకొని వాణిజ్యానికి తీవ్ర అంతరాయం ఏర్పడటం తో మరోసారి ప్రత్యామ్నాయ మార్గం కోసం చర్చలు మొదలయ్యాయి.