Begin typing your search above and press return to search.

ఔట్ సోర్సింగ్ పేరిట‌.. టీడీపీ సానుభూతిప‌రుల‌పై ఏపీ స‌ర్కారు క‌త్తి.. ఏం చేస్తోందంటే!

By:  Tupaki Desk   |   13 Dec 2022 11:30 PM GMT
ఔట్ సోర్సింగ్ పేరిట‌.. టీడీపీ సానుభూతిప‌రుల‌పై ఏపీ స‌ర్కారు క‌త్తి.. ఏం చేస్తోందంటే!
X
రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇప్ప‌టికే ఆరు మాసాలుగా జీతాల‌ను పెండింగులో పెట్టిన ప్ర‌భుత్వం.. ఇప్పుడు వారిని మ‌రోరూపంలో వేధింపుల‌కు గురిచేస్తోంద‌నే వాద‌న వినిపిస్తోంది. అస‌లు ఇప్పుడున్న ఔట్‌సోర్సింగ్లో 10 ఏళ్లు పూర్తికాని.. వారిని తొల‌గించాల‌ని ఇటీవల ప్ర‌భుత్వం పేర్కొంది. అయితే, దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రావ‌డంతో వెన‌క్కి త‌గ్గింది.

ఇక‌, ఇప్పుడు.. తాజాగా వారిని ఏదో ఒక రూపంలో ఇబ్బందులు పెట్టి వ‌దిలించుకునేందుకు వ్యూహం సిద్ధం చేసుకోవ‌డం.. త‌క్ష‌ణం దానిని అమ‌లులోకి పెట్ట‌డం.. చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇలా..వెళ్లిపోయేవారి స్థానంలో వైసీపీ సానుభూతిప‌రుల‌ను చేర్చుకునే మ‌రో ఎత్తుగ‌డ ఉంద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.

ఇప్పుడు ఏం జ‌రుగుతోంది.2014-2019 మ‌ధ్య ఏపీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు పొందిన వారి విద్య‌, అనుభ‌వం..త‌దిత‌ర వివ‌రాల‌తో కూడిన స‌ర్టిపికెట్ల‌ను ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాల‌ని.. రాత్రికిరాత్రి ఉత్త‌ర్వులు వ‌చ్చాయి. ఇలా చేయ‌పోతే.. జనవరి నెల జీతం నిలిపివేస్తామంటూ ఏపీ ఔట్ సోర్సింగ్ విభాగం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 90,609 మంది ఉద్యోగులు పని చేస్తుండగా.. వీరిలో చాలా మంది విద్యార్హత, కుల ధ్రువీకరణ పత్రాలు లేవని పేర్కొంది.

వీటిని వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేసి పంపించాలని ఆదేశించింది. పొరుగు సేవల సిబ్బందిని తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఒక పక్క ఆరోపణలు వస్తుండగా.. ఇప్పుడు కార్పొరేషన్ ఆదేశాలు ఇవ్వడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యోగంలో చేరిన కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు వీటిని అడగడం గమనార్హం.

నిజానికి గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలోనే 60 వేల మందికిపైగా ఔట్ సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న నియ‌మించారు. వీరిలో కొంద‌రు టీడీపీ సానుభూతి ప‌రులు కూడా ఉన్నారు. అయితే, అర్హులైన వారిని మాత్ర‌మే అప్ప‌ట్లో నియ‌మించాల‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.

క్షేత్ర‌స్థాయిలో ఏం జ‌రిగిందో తెలియ‌దు. ఇక‌, ఇప్పుడు వీరిని ఇంటికి పంపించేసి.. వైసీపీ వ‌ర్గానికి పెద్ద‌పీట వేయాల‌నే వ్యూహాన్ని ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంద‌ని ఉద్యోగ సంఘాలు మండిప‌డుతున్నాయి. ఒక‌వైపు.. ఒడిసాలో ఔట్ సోర్సింగ్‌ను కూడా ప‌ర్మినెట్‌చేస్తుంటే.. ఏపీలో మాత్రం..ఉద్యోగుల‌ను కూడా రాజ‌కీయ కోణంలో చూడ‌డం ఏంట‌ని మండి ప‌డుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.