Begin typing your search above and press return to search.
ఔట్ డేటెడ్ స్క్రాప్ లను చేర్చుకుంటే వైసీపీకి ఏం లాభం?
By: Tupaki Desk | 29 Aug 2020 9:30 AM GMTఏపీలో 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి నిలబడి అడ్రస్ లేకుండా ఓడిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు వైసీపీకి ‘క్యూ’ కడుతున్నారు. అది వైసీపీకి లాభమా అంటే ఖచ్చితంగా నష్టమే జరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ల నియోజకవర్గాల్లో ఇప్పుడు ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల చేత దారుణంగా ఓడిపోయి మూలన కూర్చొని ఉన్న మాజీ టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకుంటున్నారు.
జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డిని, రాజమండ్రిలో చందన రమేశ్ ను, వైజాగల్ లో రమేశ్ బాబు.. ఇలా వైసీపీలో చేరుతుంటే ఉంటే.. ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేయాలన్న ప్రశ్న వారిలో ఉదయిస్తోంది. పైగా పరపతి ఉపయోగించి ఈ టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పుల్లలు పెడుతూ కాంట్రాక్టులు, పనులు దక్కించుకుంటూ వైసీపీ ఎమ్మెల్యేలనే తొక్కేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయట.. పాలన మారినా ఇంకా టీడీపీ నేతల ఆధిపత్యం ఏంటని వైసీపీ క్షేత్రస్థాయి నేతల్లోనూ నిరసన వ్యక్తమవుతోందట..
టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరికతో పార్టీ నష్టపోతుంది తప్పితే పార్టీకి ఏం లాభం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికలు అయిపోయిన తరువాత వాళ్ల వల్ల లక్ష ఓట్లు వచ్చినా ఏమీ లాభం అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. తప్పకుండా ఇది పార్టీకి నష్టమే అని.. వైసీపీ వర్గాలు అంటున్నాయి.