Begin typing your search above and press return to search.
పెద్ద నోట్ల రద్దుకి మూడేళ్లు .. వచ్చిన మార్పులేంటి ?
By: Tupaki Desk | 8 Nov 2019 6:53 AM GMTపాత పెద్ద నోట్లు రద్దు చేసి నేటికి సరిగ్గా మూడేళ్లు. నవంబర్ 8, 2016 న పాత రూ.500, రూ. 1000 కరెన్సీని తక్షణమే రద్దు చేస్తున్నట్లు అర్ధరాత్రి సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీయే స్వయంగా ప్రకటించారు. నాడు దేశంలో 86 శాతం కరెన్సీ ఐదువందలు, వెయ్యి రూపా యల నోట్ల రూపంలోనే ఉందని మోడీ వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నల్లధనాన్ని నిర్మూలించాలన్న సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ఈ సాహసోపేతమైన చర్య నిజంగా అనుకున్నస్థాయిలో ఫలితాలనిచ్చిందా..? ఎంతమంది నల్ల కుభేరులను పట్టుకున్నారు.. ఎన్ని కోట్లు బ్యాంకులకు రప్పించారు..? ఇలాచూస్తే సామాన్యుడి మదిలో అనేక ప్రశ్నలు మెదులుతూనే ఉన్నాయి.
పెద్ద నోట్లని రద్దు చేసిన తరువాత .. జేబులోని డబ్బు మొదలెడితే... అవసరాల కోసం ఇంట్లో పెట్టుకున్న డబ్బంతా బ్యాంకుల్లోకి వచ్చింది. చేతిలో ఉన్న డబ్బును బ్యాంకు లో వేసేస్తే తర్వాతెప్పుడైనా తీసుకోవచ్చనే ఉద్దేశంతో జనాలు బ్యాంకు ల ముందు బారులు తీరారు. ఇక ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకునే డబ్బుపై పరిమితులు విధించడంతో.. ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. ఇలా... చెప్పుకుంటూ పోతే ఆ కష్టాలకు అంతే ఉండదు. ఈ అవకాశాన్ని పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ యాప్‌లు అందిపుచ్చుకున్నాయి.
అసలు పెద్ద నోట్ల రద్దుని ఎవరిని టార్గెట్ గా చేసుకొని అమలు చేసారో వారిని మాత్రం పట్టుకోలేక పోయారు. నెలల తరబడి ఎక్కడ ఏటీఎంలో డబ్బుల కోసం వెతుకులాట లో తమ సమయాన్ని వృథా చేసుకోవడం తప్ప.. ప్రభుత్వ చర్యతో ఒరింగిం దేమీ లేదన్న అభిప్రాయం మెజారిటీ ప్రజల్లో వ్యక్తమెంది. నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థపై పెనుభారం మోప డమే కాకుండా చిన్నచితకా వ్యాపారాలు చేసుకునే వారికి నరకప్రాయంలా తయారైంల్లధనాన్ని బ్యాం కులకు రప్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెర వేరకపోగా.. తప్పుడు మార్గాల్లో అక్ర మార్కులు కోట్లలో పాత పెద్దనోట్లను మార్చేసుకున్నారు. బ్యాంకులకు వెళ్ల లేదు. క్యూలైన్లలో నిలబడలేదు. కానీ నిమిషాల్లో తమ దగ్గరున్న బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకున్నారు. నల్లధన నిర్మూలన, నగదు రూపంలో అవినీతి నిర్మూలన, నకిలో నోట్ల చలా మణి రద్దు వంటి 3 ప్రధాన ఉద్దేశాలతో నోట్ల రద్దు ప్రకటన చేసినప్పటికీ ఆశించిన స్థాయిలోఫలితాలను రాబట్టడం లో ప్రభుత్వం విఫలం అయ్యింది.
నల్లధనంపై పోరు పేరిట మోదీ సర్కార్ ప్రయోగించిన నోట్ల రద్దు అస్త్రం విఫలం కావటమే కాక దేశ ఆర్థిక వ్యవస్థను కకావికలం చేసిందన్న ఆరోపణలూ కూడా వచ్చాయి. అలాగే ఈ మధ్య 2000 నోట్లని కూడా రద్దు చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అవినీతి అంతం లక్ష్యమని చెప్పినప్పటికీ మరింత పెద్ద నోట్లను ప్రవేశపెట్టడం వల్ల అక్రమ చెల్లింపులు మరింత సులభతరం చేసినట్లయింది అని పలువురు నిపుణులు తమ అభిప్రాయాలని వ్యక్తం చేసారు.