Begin typing your search above and press return to search.
ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే నష్టం ఎంత? లాభం ఎంత ? మారే అంశాలేవీ
By: Tupaki Desk | 2 Nov 2019 10:59 AM GMTతెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నేటికీ 28 రోజులకి చేరింది. ఈ సమ్మె పై అటు ప్రభుత్వం ..ఇటు ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గకపోవడంతో సమ్మెకి ఒక ముగింపు దొరకడంలేదు. ఇక దీనిపై మొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ..ఆర్టీసీ ని ప్రైవేట్ పరం చేయడం ఖాయం అంటూ చెప్పుకొచ్చారు. ఎవరు ఏ విధంగా మాట్లాడినా కూడా ఆర్టీసీ ప్రైవేటీకరణ ఖాయం అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఆర్టీసీ ని ప్రైవేట్ పరం చేస్తే ఎవరికీ లాభం , ఎవరికీ నష్టం.
సీఎం కేసీఆర్ చెప్పిన దాని ప్రకారం 30 శాతం అద్దె బస్సులు, 20 శాతం ప్రైవేటు ఆపరేటర్లకు ఇస్తే మిగిలిన 50 శాతం ఆర్టీసీకి కేటాయిస్తారన్న విషయం అర్థమవుతుంది. అలాగే గతంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ .. 70 శాతం రూట్లలో బస్సులు నష్టాల బాటలో నడుస్తున్నాయి అని తెలిపారు. ఈ మార్గాల్లో గ్రామీణ ప్రాంతాలు, హైదరాబాద్ నగర దారులే ఎక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన చూస్తుంటే నష్టాల్లో నడుస్తున్న 70 శాతం రూట్లనే ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందా లేక లాభాల్లో ఉన్న 30 శాతం బస్సు రూట్లను ప్రైవేటు ఆపరేటర్లకు ఇచ్చి ఆర్టీసీని మరింత పాతాళంలోకి తోచేస్తుందో అని తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారు.
తెలంగాణలో మొత్తం 6 వేల 500 రూట్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి చెప్పిన మాటలని బట్టి ... 20 శాతం అంటే 1300 రూట్లు ప్రైవేటుపరం కానున్నాయి. ఇందులో కూడా లాభాలు వచ్చేవి ఎన్ని.. నష్టాలు తెచ్చేవి ఎన్ని అన్న దానిపై క్లారిటీ లేదు.రవాణా మంత్రి పువ్వాడ అజయ్ మాటలను బట్టి చూస్తుంటే హైదరాబాద్ రూట్లు, గ్రామీణ ప్రాంతాల రూట్లే ప్రైవేట్ పరం చేయబోతున్నట్టు కనిపిస్తుంది. ప్రభుత్వం ఎంపిక చేసిన రూట్లు ప్రైవేటుపరమవుతే అందులో ఆర్టీసీ ఛార్జీలే వర్తిస్తాయా.. లేక ప్రైవేటు ఆపరేటర్లు సొంతంగా ధరలు నిర్ణయించుకుంటారా అనే విషయంలోనూ స్పష్టత రావాలి.
ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే .. ఆర్టీసీలో అంతర్గత వ్యవస్థ ఉంటుంది. చెక్ మెకానిజం నుంచి... డ్రైవర్లకు శిక్షణ లాంటి విషయాలన్నీ లోలోపలే నడిచిపోతుంటాయి. ఇప్పుడు ప్రైవేటు పరం చేస్తే ఇదంతా ఆర్టీఏ పరిధిలోకి వస్తుంది. ఆలా అయితే ఒకేసారి ఇన్ని వాహనాలు రోడ్డెక్కితే మాత్రం ఆర్‌టీఏకు తలకు మించిన భారం అవక తప్పదు. రోడ్డుపై తిరిగే ప్రతీ వాహనంతో ఆర్టీఏకే సంబంధం ఉంటుంది కాబట్టి అందుకు తగ్గ సిబ్బందిని కూడా నియమించుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా సీఎం కేసీఆర్ చెప్పినట్టు ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయడం కూడా అంత సులభం ఏమీకాదు అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.