Begin typing your search above and press return to search.
మూడు వ్యాక్సిన్ల ప్రభావం ఎంత? సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయ్?
By: Tupaki Desk | 21 May 2021 2:30 PM GMTకరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ మినహా మరో మార్గం లేదన్న విషయం ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతోంది. మొదట్లో వ్యాక్సిన్ పై ఉన్న సందేహాలు.. అనుమానాలు.. దాని కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మీద నెలకొన్న ఆందోళనలు వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రాకుండా చేసింది. అదేసమయంలో ప్రభుత్వాలు సైతం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రోత్సహించే పని చేయలేదు. ఎప్పుడైతే సెకండ్ వేవ్ తన తఢాఖా చూపించటం షురూ చేసిందో అప్పటి నుంచి ప్రజల మైండ్ సెట్ లో మార్పు వచ్చేసింది.
వ్యాక్సిన్ వేయించుకోవటం కోసం ఆరాటం మొదలైంది. ఇలాంటి పరిస్థితే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నెలకొనటం.. డిమాండ్ కు తగినట్లుగా వ్యాక్సిన్ అందుబాటులోకి లేకపోవటంతో టీకాల కోసం ఆరాటం పెరిగింది. ఇప్పటికే ఉన్న రెండు వ్యాక్సిన్లకు తోడుగా తాజాగా మూడో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తొలుత సీరం వారి కోవీషీల్డ్ రాగా.. రెండో వ్యాక్సిన్ గా భారత్ బయోటెక్ వారి కోవాగ్జిన్ వచ్చింది. తాజాగా రష్యాకు చెందిన స్ఫుత్నిక్ - వీ వ్యాక్సిన్ వచ్చింది. దీన్ని దేశీయంగా రెడ్డి ల్యాబ్స్ సంస్థ తయారు చేయనుంది. ప్రస్తుతానికి రష్యా నుంచి దిగుమతి చేసుకున్న వ్యాక్సిన్ ను ఇస్తున్నారు. ఇంతకీ ఈ మూడు వ్యాక్సిన్ల ప్రభావం ఎంత? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ మూడు వ్యాక్సిన్ల మీద నివేదికలు ఏం చెబుతున్నాయన్నది చూస్తే..
స్పుత్నిక్ - వీ
- 91. 6 శాతం ప్రభావం చూపుతుందన్ననిర్దారణ
- తొలి డోసు తీసుకున్న 21 రోజుల నుంచి 3 నెలల లోపు రెండో డోసు తీసుకోవాలి
- వైరల్ వెక్టార్ రకానికి చెందిన ఈ టీకా ద్రవరూపంలో ఉంటే మైనస్ 18.55 డిగ్రీల సెంటీగ్రేడ్ లో ఉంచాలి
- అదే పొడి రూపంలో ఉంచాలంటే 2 నుంచి 8 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి
- ఇప్పటివరకు ఎలాంటి సైడ్ ఎఫెక్టులు బయటపడలేదన్న మాట వినిపిస్తోంది.
- ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీల నియామకం సులువుగా జరుగుతుందట
- ఈ టీకా తీసుకున్న ప్రాంతంలో కొద్దిగా దద్దుర్లు.. నొప్పి.. జ్వరం లాంటి సాధారణ లక్షణాలే కనిపించాయి
- కొన్నిచోట్ల హైపర్ టెన్షన్.. హేమరేజి స్ట్రోక్.. ఫ్లూ వంటి లక్షణాలు కనిపించాయి. కానీ చాలా అరుదుగానే ఇలాంటివి కనిపించినట్లు చెబుతున్నారు.
కోవాగ్జిన్
- నిజమైన కరోనా కణాలతో ఎలా పోరాడాలో శరీరానికి ఈ వ్యాక్సిన్ నేర్పుతుంది
- వైరస్ మీద 81 శాతం వరకు ప్రభావం చూపుతుందని నివేదికలు వెల్లడించాయి
- ఇనాక్టివ్ వేరియస్ రకానికి చెందిన ఈ టీకా తొలి డోసు తీసుకున్న 4 నుంచి 8 వారాల్లో రెండో డోసు తీసుకోవాలి
- ఈ టీకా తీసుకున్న ప్రాంతంలో దద్దుర్లు.. చర్మం ఎర్రగా మారటం.. వాపు.. నొప్పి లాంటి లక్షణాలు కనిపించాయి
- కొందరిలో జ్వరం.. మరికొందరిలో చెమటలు పోయటం.. వణుకు.. ఒళ్లు నొప్పులు.. కళ్లు తిరగటం.. వాంతులు.. తలనొప్పి లక్షణాలు కనిపించాయి. అయితే.. అందరిలో కాదు కొందరిలోనేనని చెబుతున్నారు.
కోవీషీల్డ్
- ఆక్స్ ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా కలిసి భారత్ కు చెందిన సీరమ్ సంస్థతో కలిసి డెవలప్ చేసిన వ్యాక్సిన్
- స్పుత్నిక్ - వీ టీకా మాదిరే ఇది వైరల్ వెక్టార్ రకానికి చెందిన వ్యాక్సిన్
- తొలి డోసు తీసుకున్న 12 వారాల తర్వాత రెండో డోసు తీసుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది
- దీన్ని 2 - 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచొచ్చు. అలా ఉంచినా ఆర్నెల్ల తర్వాత వ్యాక్సిన్ పనికి రాదు
- మొదటి డోసుకు రెండో డోస్ కు మధ్య గ్యాప్ పెంచితే.. 90 శాతం ప్రభావం చూపిస్తుందని నివేదికలు చెబుతున్నాయి
- 62 దేశాల్లో ఈ వ్యాక్సిన్ వాడుకలో ఉంది. వ్యాక్సిన్ చేయించుకున్న తర్వాత.. టీకా వేసిన ప్రాంతంలో చర్మం ఎర్రగా మారటం.. ఒక మోస్తరు నుంచి హైఫీవర్.. నీరసం.. చేతులు పట్టేయటం.. ఒళ్లు నొప్పులు లాంటివి కనిపించాయి.
- కొన్ని కేసుల్లో రక్తం గడ్డ కట్టినట్లు తేలినా.. చాలా అరుదైన కేసుల్లో ఇలా జరిగినట్లు చెబుతున్నారు.