Begin typing your search above and press return to search.
ఆనం కోరితెచ్చుకున్న కుంపటి.. ఫ్యూచరేంటి..?
By: Tupaki Desk | 5 Jan 2023 4:46 AM GMTరాజకీయాల్లో అయినా.. వ్యక్తిగతంగా అయినా.. ఒకసారి విశ్వసనీయత కోల్పోతే.. మళ్లీ కూడగట్టు కోవడం చాలా కష్టం. ఇదే పరిస్థితి నెల్లూరు జిల్లాలోని ఆనం కుటుంబానికి పెద్ద శాపంగా మారిపోయింది. ఒకప్పుడు ఆనం కుటుంబం అంటే.. పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉండేది. జిల్లాను సైతం శాసించారు. కాంగ్రెస్‌లో ఉండగా.. వారిదే ఆధిపత్య రాజకీయం. ఈ క్రమంలోనే నెల్లూరు జల్లా కాంగ్రెస్‌కు కంచుకోటగా మారింది.
అయితే.. రాష్ట్ర విభజన, వైసీపీ ఆవిర్భావంతో కాంగ్రెస్ ప్రభావం కోల్పోయింది. దీంతో ఆనం కుటుంబం టీడీపీలో చేరింది. నిజానికి టీడీపీని నెల్లూరులో ఎదకుండా చేసిన వ్యక్తుల్లో ఆనం కుటుంబం ఉందనేది వాస్తవం. ఇది టీడీపీ నేతలు ఇప్పటికీ మరిచిపోలేక పోతున్నారు. అయినా.. చంద్రబాబు 2016-17 మధ్య ఆనం కుటుంబాన్ని చేరదీశారు. అయితే..త మకు పదవులు ఇవ్వలేదన్న దుగ్ధతో.. ఎన్నికలకు ముందు బయటకు వచ్చి.. టీడీపీపై విమర్శలు గుప్పించారు.
ఇక, తనకు అవసరం ఉన్నా.. లేకున్నా.. వైఎస్ అనుకూల వర్గం అనే ముద్ర వేసుకున్న నేపథ్యంలో ఆనం కుటుంబాన్ని వైసీపీ కూడా ఆదరించింది. వెంకటగిరి నియోజకవర్గం టికెట్ ఇచ్చింది. వాస్తవానికి జగన్ హవా, పాదయాత్ర ప్రభావంతోనే ఆ ఎన్నికల్లో ఆనం విజయందక్కించుకున్నారు. ఇక, ఇప్పుడు కూడా తనకు మంత్రి పదవి దక్కలేదనే దుగ్ధతోనే పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
నిజానికి చెప్పాలంటే.. ఇదే జిల్లాలో నలుగురైదుగురు రెడ్డి కమ్యూనిటీ నాయకులు.. జగన్ సీఎం అయ్యేం దుకు ప్రయత్నించారు. వారికి కూడా మంత్రిపదవులు దక్కలేదు. ఒకవేళ ఇవ్వాలని అనుకుంటే.. ముందు వారికే ఇవ్వాలి. ఈ చిన్న విషయం తెలిసి కూడా ఆనం యాగీ చేయడం .. ఆయన సొంత అజెండాను బట్టబయలు చేసింది. కట్ చేస్తే.. ఇప్పుడు వైసీపీ ఆయనను వదిలించుకునే పరిస్థితిలో ఉంది.
ఈ నేపథ్యంలో ఆనం ఫ్యూచరేంటి? అనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడున్న వైసీపీ టికెట్ ఇవ్వదు. టీడీపీలోకి వెళ్లాలని అనుకున్నా.. సోమిరెడ్డి సహా ఇతర నేతలు వద్దనే అంటున్నారు. ఇక, ఏ పార్టీలోకి వెళ్తారు. జనసేన, లేదా బీఆర్ ఎస్ ఈ రెండు పార్టీలు మాత్రమే ఆప్షన్‌గా మిగిలాయి.
జనసేనతో వెళ్లినా.. ఈ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందనే చర్చ ఉంది. కాబట్టి.. ఏం జరుగుతుందో టెన్షన్ తప్పదు. ఇక, బీఆర్ ఎస్‌లోకి వెళ్లినా.. మరో బీజేపీ తరహాలోనే ఉంటుంది. సో.. ఎలా చూసుకున్న ఆనం చేజేతులా.. ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయారనేదివాస్తవం అంటున్నారు నెల్లూరు జిల్లా ప్రజలు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.