Begin typing your search above and press return to search.
నా భవిష్యత్ జగన్ చేతిలోనే.. వైవీ సుబ్బారెడ్డి హాట్ కామెంట్స్
By: Tupaki Desk | 5 July 2021 3:55 AM GMTసొంత బాబాయి.. జగన్ కు దగ్గరి బంధువు.. వైసీపీ అధికారంలోకి రాగానే ఆయనకే మొదట ప్రతిష్టాత్మక, వందల కోట్ల విలువైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్ గా జగన్ నియమించారు. అంతటి పదవిని ఇచ్చి జగన్ తన బాబాయిని గౌరవించారు. అయితే ఇప్పుడా పదవి కాలం ముగుస్తోంది. ఈ క్రమంలోనే ‘తన భవిష్యత్ జగన్ చేతిలోనే ఉంది’ అంటూ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీ ఎంపీ, జగన్ బాబాయి అయిన వైవీ సుబ్బారెడ్డి మనసు మారింది. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల వైపు తను దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. ఈ విషయం ప్రస్తుతం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. బాబాయ్ కోరికను జగన్ మన్నిస్తాడా? మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అనుమతిస్తారా? ఏదైనా రాజకీయ పదవి ఇస్తారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
గతంలో ఒంగోలు ఎంపీగా వైవీ సుబ్బారెడ్డికి టికెట్ ఇచ్చి జగన్ గెలిపించారు. అయితే 2019 ఎన్నికల్లో జగన్ తన బాబాయికి ఒంగోలు టికెట్ తీవ్ర పోటీ కారణంగా ఇవ్వలేదు. రాజ్యసభకు వెళ్లేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు వైసీపీ అధిష్టానం ఉభయ గోదావరి జిల్లాల ిన్ చార్జి అనంతరం టీటీడీ చైర్మన్ ను చేసింది.
ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంపీ, లేదా ఎమ్మెల్యేగా కొనసాగాలని ఆసక్తి ఉన్నప్పటికీ జగన్ సూచన మేరకు వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా అయిష్టంగానే బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం జూన్ 20తో ముగుస్తోంది. దీంతో సుబ్బారెడ్డిని జగన్ ఏం చేస్తారు? ఆయన రాజకీయ భవితవ్యం ఏంటనేది ఆసక్తిగా మారింది.
ఈ క్రమంలోనే తాజాగా ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చిన వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటివరకు పరిపాలనతో సంబంధం లేని టీటీడీ బాధ్యతల్లో తాను ఉన్నానని.. అందువల్లే రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే న్యాయం చేయవచ్చన్నారు. ఈ మేరకు జగన్ కు ఈ విషయాలు చెప్పానని.. ప్రత్యక్ష రాజకీయాల్లోరి రావాలని అనుకుంటున్నానని వివరించానన్నారు. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. దీంతో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది.