Begin typing your search above and press return to search.

ఈ విద్యార్దుల గతేమిటో ?

By:  Tupaki Desk   |   13 Jun 2021 2:30 PM GMT
ఈ విద్యార్దుల గతేమిటో ?
X
కరోనా మహమ్మారి కారణంగా అన్నీ వర్గాల వారికీ ఇబ్బందులు ఎదురైనట్లే విద్యార్ధులకు కూడా సమస్యలు మొదలయ్యాయి. కరోనా వైరస్ కారణంగా స్కూళ్ళు జరగటంలేదు. కాబట్టి అందుబాటులో ఉన్న సౌకర్యాలతో టీచర్లు తమ విద్యార్ధులకు ఆన్ లైన్లోనే పాఠాలు చెబుతున్నారు. అయితే ఆన్ లైన్లో పాఠాలు చెప్పటం కూడా ఇపుడు టీచర్లకు ఇబ్బందిగా మారింది.

ఇందుకు కారణం ఏమిటంటే చాలామంది పిల్లలకు ఆన్ లైన్ సౌకర్యం లేకపోవటమే. రాష్ట్రంలో ఉన్న పిల్లాల్లో ఎంతమందకి ఆన్ లైన్ సౌకర్యం ఉందనే విషయంలో ప్రభుత్వం సర్వే మొదలుపెట్టింది. ఈ సర్వే ద్వారా బయటపడిన విషయాలు ఏమిటంటే రాష్ట్రం మొత్తంమీద 43 లక్షల మంది పిల్లలున్నారట. ఇప్పటికి 38 లక్షల మంది పిల్లల విషయంలో సర్వే పూర్తయ్యింది.

సర్వే ప్రకారం టీవీ సౌకర్యం లేని విద్యార్ధులు 20 శాతం మందున్నారట. మొబైల్ ఫోన్+ఇంటర్నెట్ డేటా సౌకర్యం ఉన్న విద్యార్ధులు కేవలం 5 శాతం మందేనట. మొబైల్ ఉన్నా కూడా ఇంకా 2 జీ సౌకర్యాన్నే ఉపయోగించుకుంటున్న విద్యార్ధుల 27 శాతం ఉన్నట్లు తేలింది. అసలు మొబైల్ ఫోన్ అందుబాటులో లేని విద్యార్ధులు 18 శాతం మందున్నారట.

కరోనా వైరస్ కారణంగా స్కూళ్ళు మూసేయటంతో విద్యార్ధులు తమ ఊర్లకు వెళ్ళిపోయారు. నిజానికి స్కూళ్ళయినా, కాలేజీలైనా విద్యార్ధుల్లో ఎక్కువమంది రూరల్ ఏరియా నుండి వచ్చే వాళ్ళే అయ్యుంటారనటంలో సందేహంలేదు. వైజాగ్, విజయవాడ, తిరుపతి లేదా జిల్లాల హెడ్ క్వార్టర్లు, పెద్ద పట్టణాల్లో మాత్రమే ఇంటర్నెట్, మొబైల్ సిగ్నల్, డేటా సౌకర్యం ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో చాలా కొద్దిచోట్ల మాత్రమే పై సౌకర్యాలుంటాయి. కాబట్టే ఇపుడు పిల్లలకు ఆన్ లైన్ పాఠాలు ఇబ్బందిగా మారింది. మరి వీళ్ళ పరిస్దితి ఏమిటో అర్ధం కావటంలేదు.