Begin typing your search above and press return to search.
టీడీపీలో ఉంటారా? వైసీపీ బాట పడతారా? మాజీ ఎమ్మెల్యే సంగతేంటి?
By: Tupaki Desk | 27 Sep 2021 12:55 PM GMTమాజీ ఎమ్మెల్యే, యువ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ ఫ్యూచరేంటి? ఆయన టీడీపీలోనే ఉంటారా? లేక.. మళ్లీ పాత గూటికి వైసీపీలోకి వెళ్తారా? అనే చర్చ జోరందుకుంది. నిన్న మొన్నటి వరకు .. ఆయన కృష్ణాజిల్లా గుడివాడ చుట్టూ చక్కర్లు కొట్టారు. దీంతో ఇక, ఆయన గుడివాడ నుంచి పోటీ చేస్తారని.. దీనికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు ప్లాన్ ఇచ్చారని.. అందుకే అక్కడ తిరుగుతున్నారని విశ్లేషణలు వచ్చాయి. నిజానికి గుడివాడ ఆయనకు లోకల్ కాదు.. నాన్ లోకల్‌కాదు. అయినా.. ఇప్పటి వరకు ఎప్పుడు ఆయన అక్కడ నుంచి పోటీ చేసింది. కేవలం విజయవాడ తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాల నుంచే పోటీ చేశారు. 2004లో ఒకసారి మాత్రమే ఆయన విజయం దక్కించుకున్నారు.
ఇక, ఆతర్వాత నుంచి ఆయన పార్టీలు మారడం.. నియోజకవర్గాన్ని మార్చుకోవడంతో.. రాధా పరిస్థితి ఇరకాటంలో పడింది. వాస్తవానికి కాంగ్రెస్‌తో ప్రారంభించిన రాధా రాజకీయం.. తర్వాత ప్రజారాజ్యం, తర్వాత.. వైసీపీ మళ్లీ ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. అయితే.. ఎక్కడున్నా.. కలివిడి లేకపోవడం. ఆయనకు ప్రధాన మైనస్‌గా మారిపోయింది. కేవలంతన తండ్రి వర్ధంతులు, జయం తులకే పరిమితం కావడం.. సాధారణ ప్రజల్లోకి కూడా రాకపోవడం వంటివి రాధా రాజకీయాలకు పెద్ద ఇబ్బందిగా మారింది. కాపు సామాజిక వర్గం అండ ఉందని చెప్పుకోవడమే తప్ప.. ఇప్పటి వరకు ఆ వర్గం కూడా రాధాకు చేరువైన పరిస్థితి లేదు. సో.. ఈ క్రమంలోనే ఆయన విజయానికి దూరమయ్యారు.
గత ఎన్నికల సమయంలో వైసీపీ విజయవాడ తప్ప.. ఎక్కడ పోటీ చేసినా.. టికెట్ ఇస్తామని చెప్పింది. లేదా.. రాజ్యసభకు పంపుతామని ప్రకటించింది. అయినా.. రాధా ససేమిరా అని.. సెంట్రల్ సీటు కోసం పట్టుబట్టి.. చివరకు పార్టీ నుంచి బయటకు వచ్చారు. పోనీ. ఈ క్రమంలో ఆయన సాధించింది ఏమైనా ఉందా? అంటే అది కూడా లేదు. దీంతో రాధా ఫ్యూచర్.. ఇబ్బందుల్లో పడింది. ప్రస్తుతం టీడీపీ పుంజుకున్నా.. గతంలో మాదిరిగానే.. విజయవాడ పరిదిలో ఆయన పోటీ చేసేందుకు నియోజకవర్గాలు ఖాళీ లేకుండా పోయాయి. సో.. ఈ నేపథ్యంలో ఆయన గుడివాడలో ఇటీవల చక్కర్లు కొట్టడం.. ఆసక్తిగా మారింది. అయితే.. తాజాగా వెలుగు చూసిన ఘటన.. ఇక, ఆయన టీడీపీ సైకిల్ దిగేస్తున్నారనే వాదనను తెరమీదికి తెచ్చింది.
గుడివాడ వైసీపీ నాయకుడు పాలేటి సుబ్రహ్మణం మనవడి పుట్టిన రోజు వేడుకల్లో మంత్రి కొడాలి నానితో పాటు వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఇద్దరూ పరస్పరం పలకరించుకున్నారు. మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధా మంత్రి కొడాలికి చెందిన కె కన్వెన్షన్ అతిథి గృహంలో రెండు గంటల పాటు సమావేశమయ్యారు. ప్రధానంగా వంగవీటి రాధాకృష్ణ రాజకీయ భవిష్యత్తుపై వారి మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. సీఎం జగన్మోహనరెడ్డితో చర్చించి వైసీపీలో ప్రాధాన్యత కల్పించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేలా ఒప్పిస్తానని మంత్రి కొడాలి నాని ఈ సందర్భంగా వంగవీటి రాధాకు ప్రతిపాదించారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. వంగవీటి రాధాను అభిమానించే వైసీపీ నాయకులు కూడా ఈ దిశగానే రాధాపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రాధా ఇక, టీడీపీలో ఉంటారా? వైసీపీ బాట పడతారా? అనేది ఆసక్తిగా మారింది.