Begin typing your search above and press return to search.
పోలవరానికి పవన్ నాలుగో పెళ్ళికి లింకేంటో...?
By: Tupaki Desk | 21 Oct 2022 7:30 AM GMTఏపీకి జీవనాడి పోలవరం. అది పూర్తి అయితే లోక కళ్యాణమే జరుగుతుంది. ఏపీలో అటు వ్యవసాయరంగంతో పాటు ఇటు పారిశ్రామిక రంగం కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతాయి. అలాంటి కీలకమైన పోలవరం ప్రాజెక్టు ఎపుడు పూర్తి అవుతుందో అన్న బాధ బెంగ ఆవేదన ఏపీ జనాలకు నిండా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ నాలుగవ పెళ్ళికి పోలవరానికి అంబటి చిత్రమైన లింక్ పెట్టేసారు.
ఇక విపక్ష తెలుగుదేశం అయితే తాము డెబ్బై శాతం పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్ట్ ని వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక పక్కన పడేసింది అని ఎపుడూ కామెంట్స్ చేస్తూ ఉంటుంది. దానికి సమాధానంగా ఇదంతా మీ నిర్వాకమే కాపర్ డ్యాం ముందు కట్టకుండా డయాఫ్రం వాల్ ని నిర్మాణం చేయడం వల్ల అది కాస్తా గోదావరి వరదలలో కొట్టుకు పోయి ఏకంగా వేల కోట్ల నష్టం వాటిల్లిందని, ఇది ప్రపంచ వింత అని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎప్పటికపుడు ఏకరువు పెడుతూ ఉంటారు.
సరే టీడీపీ వైసీపీల మధ్య ఇది ఎపుడూ తీరని గొడవగానే ఉంటుంది అన్నది తెలిసిందే. అయితే ఇపుడు మధ్యలోకి జనసేన ఎంట్రీ ఇచ్చింది. ఏకంగా అధినేత పవన్ కళ్యాణ్ అయితే అంబటి కి గుచ్చేలా సెటైరికల్ గా పోలవరం ప్రాజెక్ట్ ఎంతవరకూ వచ్చింది, ఎపుడు పూర్తి అవుతుంది అన్నది ఒక అరగంట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలవా అంబటీ అని ట్వీట్ చేశారు. ఇందులో మిగిలినది ఒక విపక్ష పార్టీ అధినేతగా పవన్ అడిగినా మధ్యలో ఇన్వెర్టెడ్ కామాస్ పెట్టి మరీ అరగంట అంటూ అంబటిని కెలకడంలోనే రంజు అయిన రాజకీయం ఉంది మరి.
అప్పట్లో అంబటి మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆయన అరగంట సేపు మాట్లాడాలి అంటూ ఎవరో లేడీ యాంకర్ తో ఫోన్ లో అన్నట్లుగా వార్తలు వచ్చాయి. దాని మీద మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అంబటి మధ్యన చాలా పెద్ద మాటల యుద్ధమే జరిగింది. ఇపుడు అదే మాటలను పవన్ కళ్యాణ్ కెలికారు అన్న మాట. ఆయన ఎందుకు అలా అన్నారంటే ఆయన మీద ఇటీవల కాలంలో అంబటి ట్వీట్ల ద్వారా మీడియా ముందు పెద్దగానే మాట్లాడుతున్నారు.
పవన్ని ప్యాకేజీ స్టార్ అనే అంటాం, ఆయన 175 సీట్లలో సొంతంగా పోటీ చేయలేడు కదా అందుకే అలా అంటామని అంబటి గట్టిగా అంటున్నారు. అంతే కాదు యుద్ధానికి సిద్ధం అన్న వాడు తీరా చూస్తే కనిపించడమే అని టీడీపీతో జనసేన పొత్తుల మీద కూడా అంబటి కామెంట్స్ చేశారు. దాంతో మండిన పవన్ కళ్యాణ్ ఇపుడు అంబటిని అరగంట అంటూ నర్మగర్భంగా కెలికారు అన్న మాట.
మరి అవతల వైపు ఉన్నది అంబటి. ఆయన అసలే వెటకారం డాట్ కం. అందుకే పవన్ కళ్యాణ్ నాలుగవ పెళ్ళి అయ్యేలోగా పోలవరాన్ని పూర్తి చేస్తామని పవన్ కి గట్టి రిటార్ట్ ఇచ్చేశారు. పవన్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న సంగతి విధితమే. ఆయన నాలుగవ పెళ్ళి అనడం అంటే అంబటి గట్టిగా కెలకడమే. అంటే పవన్ ప్రశ్నలో అరగంటకు ఈయన ఇలా బదులు ఇచ్చారన్న మాట.
సరే ఈ ట్వీట్లు సరదాలు, రివేంజిలు బాగానే ఉన్నాయి కానీ అసలు పోలవరం ఎపుడు పూర్తి అవుతుందో జనాలకైనా సరిగ్గా చెప్పరాదే అంబటీ అని అంటున్నారు. పోలవరం పూర్తి చేయడానికి ఉత్సాహం చూపించకుండా ఈ రాజకీయ విమర్శలు ఏంటి అని కూడా అంటున్నారు. పైగా పవన్ కళ్యాణ్ నాలుగవ పెళ్ళికి దీనికి లింక్ ఏంటి సామీ అని కూడా విమర్శిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

పవన్ నాలుగో పెళ్లిలోపు పూర్తి చేసే బాధ్యత నాది ! pic.twitter.com/YxGK52BIbg
— Ambati Rambabu (@AmbatiRambabu) October 21, 2022