Begin typing your search above and press return to search.

రియల్ రంగంలో హైదరాబాద్ సంస్థలు ఎన్నో స్థానమంటే?

By:  Tupaki Desk   |   2 July 2021 9:30 AM GMT
రియల్ రంగంలో హైదరాబాద్ సంస్థలు ఎన్నో స్థానమంటే?
X
రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ మహానగరం ఎంత శక్తివంతమైనదన్న విషయాన్ని మరోసారి చాటా చెప్పే రిపోర్టు ఒకటి తాజాగా విడుదలైంది. అంతర్జాతీయంగా మాంచి పేరున్న మీడియా సంస్థ ఏసియా వన్. రియల్ ఎస్టేట్ రంగంలో టాప్ 50 బ్రాండ్స్ అండ్ లీడర్స్ పేరుతో ఒక జాబితాను విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్ కు చెందిన నాలుగు కంపెనీలకు చోటు లభించగా.. అవన్నీ టాప్ ఆరులోనే చోటు లభించటం విశేషంగా చెప్పాలి.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అన్నంతనే గుర్తుకు వచ్చే బడా కంపెనీ మైహోం. తాజా నివేదికలోనూ మైహోం గ్రూప్ ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావు మొదటి స్థానంలో నిలిచారు. ఆయనకు రూ.7300 కోట్ల సంపద ఉన్నట్లుగా పేర్కొన్నారు. తర్వాతి స్థానంలో అపర్ణా కన్ స్ట్రక్షన్స్ సీఎండీ ఎస్ఎస్ రెడ్డి రూ.5200 కోట్లతో రెండో స్థానంలో నిలవగా.. అపర్ణా కన్ స్ట్రక్షన్స్ డైరెక్టర్ సీవీ రెడ్డి రూ.4350 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు.

రాంకీ ఇన్ ఫ్రా ఛైర్మన్ అయోధ్య రామిరెడ్డి రూ.2675 కోట్లతో నాలుగో స్థానంలో నిలవగా.. అలియన్స్ గ్రూప్ అండ్ అర్బనైజ్ సీఎండీ మనోజ్ నంబూరు రూ.2175 కోట్ల సంపదతో ఐదో స్థానంలో నిలిచారు. ఇదే సంస్థకు చెందిన వైస్ ఛైర్మన్ సునీల్ బొమ్మిరెడ్డి రూ.2150 కోట్లతో ఆరోస్థానంలో నిలిచారు. మొత్తంగా జాబితాలో టాప్ ఆరుస్థానాలు హైదరాబాద్ కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలకు దక్కటం విశేషంగా చెప్పక తప్పదు.