Begin typing your search above and press return to search.
కరోనా వ్యాక్సిన్ వృథాలో తెలంగాణ స్థానం ఎంతంటే ?
By: Tupaki Desk | 20 April 2021 1:30 PM GMTదేశంలో ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీనితో కరోనాను అరికట్టడానికి టీకానే మన ముందున్న ఆయుధం. అయితే ,దేశంలో తగినంత వ్యాక్సిన్ నిల్వలు లేక ప్రజలు టీకాల కోసం కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తుంటే పలు రాష్ట్రాల నిర్లక్ష్య ధోరణి కారణంగా అవి వృథా అవుతున్నాయి. దేశంలో 23 శాతం వ్యాక్సిన్లు వృథా అయ్యాయని సమాచార హక్కు చట్టం నివేదికలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 11వ తేదీ వరకు 23 శాతం వ్యాక్సిన్లు వృథా అయ్యాయి. సమాచార హక్కు చట్టం కింద ఈ విషయం తెలిసింది. ఏప్రిల్ 11 నాటికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపిణీ చేసిన 10.34 కోట్ల వ్యాక్సిన్లలో 44.78 లక్షల (23 శాతం) టీకాలు వృథా అయ్యాయని వెల్లడించింది.
ఇక కరోనా వ్యాక్సిన్లను ఎక్కువగా వృథా చేస్తున్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు, పంజాబ్, హర్యానా, మణిపూర్, తెలంగాణ ఉన్నాయి.తమిళనాడులో అత్యధిక స్థాయిలో టీకాలు వృథా అయినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు ఇస్తున్నారు. రెండో విడతలో మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు ఇవ్వనున్నారు. ఈక్రమంలో వ్యాక్సిన్లు వృథా కావటం గమనించాల్సిన విషయం. తమిళనాడులో 12.10 శాతం వ్యాక్సిన్లు వృథా కాగా హర్యానాలో 9.74 శాతం, పంజాబ్ లో 8.12 శాతం, మణిపూర్ లో 7.8 శాతం, తెలంగాణలో 7.55 శాతం వ్యాక్సిన్లు వృథా అయ్యాయని సమాచారం చట్టం తెలిపింది. కాగా వ్యాక్సిన్ జీరో వేస్టేజీ నమోదైన రాష్ట్రాలలో కేరళ, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, గోవాలతో పాటు డామన్ డయ్యూ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండటం విశేషం. కోవీషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను ప్రస్తుతం ఇండియన్లకు ఇస్తున్నారు. ఇప్పటివరకు 45 ఏళ్లకి పై బడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నారు. మే ఒకటి నుండి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.