Begin typing your search above and press return to search.

పోలింగ్ బూత్ బయట ప్రెస్ మీట్ ఏంది?జై జగన్ నినాదం ఏంది రోజా?

By:  Tupaki Desk   |   10 March 2021 4:30 PM GMT
పోలింగ్ బూత్ బయట ప్రెస్ మీట్ ఏంది?జై జగన్ నినాదం ఏంది రోజా?
X
ఎన్నికలు ఏవైనా ఎన్నికలే. అన్నింటికి ఒకేలాంటి నిబంధనలు వర్తిస్తాయి. లోక్ సభ ఎన్నికలకైతే ఒకలాంటి.. మున్సిపల్ ఎన్నికలకు అయితే మరోలాంటి నిబంధనలు ఉండవు కదా? పోలింగ్ స్టేషన్ కాదు.. పోలింగ్ బూత్ బయటే.. మీడియాతో మాట్లాడటం.. అభ్యర్థిని పరిచయం చేయటం.. పార్టీ అంతర్గత రాజకీయాలు మాట్లాడటం.. చివర్లో జై జగన్ అంటూ నినాదాలు ఇవ్వటం చూస్తే.. సీనియర్ నేతగా ఆర్కే రోజాకు నిబంధనలు పట్టవా? అన్న సందేహం కలుగక మానదు.

ఈ రోజు (బుధవారం) ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తన ఓటు వేసేందుకు ఏపీఐఐసీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలా ఓటు వేసి.. ఇలా బయటకు రాగానే.. మీడియాకు చెందిన కొందరు మాట్లాడమనటం.. చానళ్ల వారు మైకులు ముందు పెట్టేయటంతో.. ఎన్నికల నిబంధనలు గుర్తుకు రాలేదో ఏమో కానీ.. రోజా మాట్లాడటం మొదలు పెట్టారు.

పోలింగ్ జరుగుతున్న వేళ.. అందునా పోలింగ్ బూత్ బయట సాధారణంగా మాట్లాడరు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందన్న భావనతో ఆచితూచి అన్నట్లు రెండు ముక్కుల్లో అందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలన్న మాట చెప్పేసి వెళ్లిపోతారు. అందుకు భిన్నంగా రోజా మాత్రం.. అన్ని అంశాల్ని మాట్లాడారు.తన వైరి వర్గంపై విమర్శలు చేశారు. అధినేతజగన్ కు వారి గురించి కంప్లైంట్ చేస్తామన్న మాటతో పాటు.. అభ్యర్థిని పరిచయం చేయటం.. తాను ఓటుహక్కును వినియోగించుకున్నట్లుగా చెప్పిన వైనం చూస్తే.. రోజా నిబంధనల్ని మర్చిపోయినట్లుగా కనిపించక మానదు.