Begin typing your search above and press return to search.

భారతదేశంలో ఫైజర్ టీకా ధర ఎంతంటే?

By:  Tupaki Desk   |   10 Jun 2021 9:30 AM GMT
భారతదేశంలో ఫైజర్ టీకా ధర ఎంతంటే?
X
ప్రపంచంలోనే తొలి పూర్తి స్థాయి క్లినికల్ ట్రయల్స్ తో 95 శాతం కరోనా నివారణ వ్యాక్సిన్ గా ఖ్యాతి గడిచింది అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజ సంస్థ ఫైజర్ వ్యాక్సిన్. అమెరికా ఫార్మాస్యూటికల్ దిగ్గజం ‘ఫైజర్’ తయారు చేసిన ఈ ఎంఆర్ఎన్ఏ ఆధారిత కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను బయోఎంటెక్ సహకారంతో అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్ ను భారతదేశంలోనూ లాంచ్ చేయబోతున్నారు. ఫైజర్ వ్యాక్సిన్ ధరను కూడా ఒక మోతాదుకు 10 డాలర్లు (సుమారు 730 రూపాయలు) కంటే తక్కువ ధరకే ఇవ్వవచ్చని అంటున్నారు. ఈ మేరకు భారత ప్రభుత్వ వైద్య వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లలో అతి తక్కువ ధరల్లో ఒకటి కావడం విశేషం. అమెరికా, యుకే , యూరోపియన్ యూనియన్ వంటి అభివృద్ధి చెందిన మార్కెట్లలో నిర్ణయించిన ధర కంటే ఇది దాదాపు సగం ధర కావడం విశేషం.

"ఇది ఒక డోసుకు ఫైజర్ వ్యాక్సిన్ ధర" అని ఆ వర్గాలు తెలిపాయి. "ఇది ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిస్వార్థంగా ప్రజలకు వేయడానికి లాభాపేక్షలేని ధర." అని వ్యాక్సిన్ సరఫరా కోసం ఫైజర్ ముందుకొచ్చిందని సమాచారం. ఫైజర్ సంస్థ ఇప్పుడు భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.

కరోనా మహమ్మారిని అరికట్టడం కోసం ప్రభుత్వాలకు మాత్రమే వ్యాక్సిన్‌ను ఇలా తక్కువ ధరకు సరఫరా చేస్తామని ఫైజర్ గొప్పమనుసు చాటుకుంది. ప్రభుత్వాలకు ప్రత్యేకంగా మద్దతు ఇచ్చేందుకు తక్కువ ధరకు వ్యాక్సిన్ అందిస్తున్నామని తయారీదారు చెప్పారు.దీంతో భారత్ లోని ప్రజలకు మెరుగైన ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోందని తెలుస్తోంది.