Begin typing your search above and press return to search.

అమెరికాలో బాంబ్ మంచు తుఫాన్ వెనుక అసలు కారణం ఏంటి..?

By:  Tupaki Desk   |   30 Dec 2022 3:49 AM GMT
అమెరికాలో బాంబ్ మంచు తుఫాన్ వెనుక అసలు కారణం ఏంటి..?
X
అమెరికాను ఇటీవల మంచు తుఫాన్ విలయం సృష్టిస్తోంది. కంటి చూపు మేరకు మనిషి కనిపించలేనంతగా మంచు తుఫాను విరుచుకుపడుతుండడంతో అక్కడి జనాలు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. చాలా చోట్ల కరెంట్ సప్లయ్ చేసే కేంద్రాలు సైతం మంచుతో నిండిపోవడంతో దాదాపు పట్టణాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. అయితే ఇలాంటి విపత్తు ప్రతీ ఏడాది సంభవించేది కాదు. ప్రతీ జనరేషన్ కోసారి ఇది వస్తుందని అక్కడి వాతావరణ అధికారులు స్థానిక మీడియాకు చెబుతున్నారు. కానీ ఈసారి మాత్రం క్రిస్మస్ పండుగ సందర్భంగా మంచుతుఫాను రావడంతో చాలా మంది ఇళ్లలోనే ఉండి వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు మంచు తుఫాను వెనుక అసలు కారణం ఏంటి..? బాంబ్ సైక్లోన్లు అని ఎందుకు అంటున్నారు..?

అమెరికా నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం మంచు తుఫానును బలమైన గాలిగా వర్ణిస్తారు. మంచు తుఫాను సంభవించే ముందు 25 గంటల పాటు అతి తక్కువ ఉష్ణోగ్రతతో గాలులు వీస్తాయి. అంటే -25 సెంటిగ్రేట్ నుంచి -15 ఫారన్ హీట్ లేదా 500 అడుగుల కన్నా తక్కువగా ఉన్న గాలులు భీకరంగా మూడు గంటలపాటు కొనసాగుతాయి. యునైటెడ్ కింగ్ డమ్ మాత్రం మంచు తుఫానును 30 ఎంపీహెచ్ మరియు 60 అడుగులు అంతకంటే తక్కువ ప్రభావంతో వీచే గాలులు అని వర్ణించింది. అతి తక్కువ ఉష్ణోగ్రతతో గాలులు వీయడం వల్ల నీటి బింధువులు మంచు గడ్డలుగా మారి కురుస్తాయి.

సాధారణంగా తుఫానుతో జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. అలాంటిది బలమైన గాలులతో కూడిన మంచు కురవడం వల్ల ప్రజలు శ్వాసకూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి తుఫానుతోనే రోడ్డు మీద వెళ్లే ప్రజలు సైతం మంచులో కూరుకుకపోయి మరణించారు. ప్రధాన నగరాలు సైతం మంచుతో కప్పబడ్డాయి. ఇక విద్యుత్ సరఫరా చేసే కేంద్రాలు మంచుతో కప్పబడడంతో చాలా పట్టణాలు చీకట్లోనే మగ్గిపోయాయి. ఈ క్రమంలో వివిధ కారణాలతో అమెరికాలో 60 మంది మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇక అమెరికాలో మంచు తుఫాను కారణంగా బాగా వినిపిస్తున్న పేరు బాంబ్ సైక్లోన్. మంచు తుఫాను వచ్చినప్పుడు దాని వాతావరణ పీడన స్థాయి కనిష్ట స్థాయికి చేరితే ఆ తుఫానును బాంబ్ సైక్లోన్ గా పిలుస్తారు. ప్రస్తుతం ఈ బాంబ్ సైక్లోన్ గ్రేట్ లేక్స్ ప్రాంతంలో ఏర్పడిందిన అక్కడి అధికారులు చెబుతున్నారు. బాంబ్ సైక్లోన్ ఏర్పడడానికి ముందుగా చల్లని లేదా వెచ్చని గాలులు వీస్తాయి. ఆ తరువాత వెచ్చని గాలి పీడనాన్ని తగ్గింది. ఈ పీడనం ద్వారా గాలిలోని తేమ చిక్కబడిపోతుంది. క్రమంలో తుఫాను మేఘాలుగా ఏర్పడుతాయి. ఈ పీడనం 24 గంటల్లో 24 మిల్లీ బార్స్ కంటే వేగంగా తగ్గితే బాంబ్ సైక్లోన్ ఏర్పడుతుంది.

అమెరికా, కెనడాలో మరికొంత కాలం ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. తాజా లెక్కల ప్రకారం మరో తెలుగు వ్యక్తి మరణించారు. దీంతో మొత్తంగా ముగ్గురు తెలుగువారు మరణించారు. అల్పపీడనం వల్ల ఇప్పటికే కెనడా నుంచి టెక్సస్, మెక్సికో సరిహద్దుల వరకు మంచు, నీరు గడ్డ కట్టించే బలమైన గాలులు వీస్తున్నాయి. అమెరికా పశ్చిమ రాష్ట్రాల్లోనైతే -50 ఫారన్ హీట్ ఉష్ణోగ్రతలకు పడిపోయాయి. కెనడాలోని ఒంటరియా, క్యూబెక్ రాష్ట్రాలు తీవ్ర ప్రభావితంగా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.