Begin typing your search above and press return to search.

బీజేపీలో కొస‌రు నేత‌ల దూకుడు.. యూట‌ర్న్ వెనుక రీజ‌నేంటి...?

By:  Tupaki Desk   |   26 Dec 2021 12:30 AM GMT
బీజేపీలో కొస‌రు నేత‌ల దూకుడు.. యూట‌ర్న్ వెనుక రీజ‌నేంటి...?
X
ఏపీ బీజేపీలో రెండు ర‌కాల నేత‌లు ఉన్నార‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అస‌లు నేతలు, కొస‌రు నేత‌లు. అస‌లు నేత‌లు అంటే.. ఆర్ ఎస్ ఎస్ నుంచి వ‌చ్చి.. పార్టీలో చ‌క్రం తిప్పుతున్న నాయ‌కులు. వీరు పార్టీకి శాశ్వ‌త‌మైన నాయ‌కులుగా పేరు తెచ్చుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు వ‌చ్చినా.. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా.. వీరు మాత్రం శాశ్వతంగానే ఉన్నారు. అంతేకాదు.. ప‌ద‌వులు ఆశించ‌కుండా కూడా ప‌నులు చేయ‌డం వీరికే సొంతం.

అయితే.. ఇటీవ‌ల కాలంలో పార్టీలోకి కొస‌రు నేత‌లు వ‌చ్చారు. ఇక‌, వీరి గురించి తెలిసిందే. ఇత‌ర పార్టీల్లో ఉంటూ.. అక్క‌డ అధికారంలో ఉన్న స‌మ‌యంలో చేసిన కొన్ని ప‌నుల నుంచి త‌మను తాము ర‌క్షించుకు నేందుకు వీలుగా బీజేపీ పంచ‌న చేరిన వారు. వీరు అవ‌స‌రార్థం వ్య‌వ‌హ‌రించే నాయ‌కులు. ఎప్పుడు ఎలాంటి అవ‌స‌రం ఉన్నా.. వారు వెంట‌నే.. జంప్ చేస్తారు. ఎటు గాలివీస్తే.. అటు నాయ‌కుల ప‌య‌నం.. అన్న‌ట్టుగా వీరు వ్య‌వ‌హ‌రిస్తుంటారు.

కానీ.. పార్టీ అభివృద్ధి కోసం.. లేదా.. పార్టీని నిల‌బెట్ట‌డం కోసం. అధిష్టానం కొన్ని విష‌యాల్లో రాజీ ప‌డిం ది. అయితే.. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు అస‌లు నేత‌లు ఒకింత దూకుడుగా ఉంటే.. ఈ కొస‌రు నేత‌లు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. క‌నీసం పార్టీ కోసం.. ముందుకు వ‌చ్చి మీడియాతో అయినా.. గ‌ళం వినిపించింది లేదు. ఒక్క బ‌ద్వేల్ ఎన్నిక‌లో మాత్రం ఒకింత సాయం చేశార‌ని అనుకున్నా.. అది కూడా త‌మ త‌మ ప‌రిధిలోనే చేశార‌ని పార్టీలోనే గుస‌గుస వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో వీరిని చేర్చుకుని కూడా ఏం సాధించాం.. ? అనే మాట వ్య‌క్త‌మైంది.

ఇక‌, అస‌లు నేత‌లు మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. కొన్ని సార్లు.. మౌనంగా ఉన్నా.. కీల‌క విష‌యాల్లో.. మాత్రం ఏపీ స‌ర్కారును వ్యూహాత్మ‌కంగా ఇరుకున నెట్టారు. అంత‌ర్వేది, రామ‌తీర్థం వంటి ఘ‌ట‌న‌లు విజ‌య‌వాడ దుర్గ‌మ్మ ఆల‌యానికి చెందిన వెండి సింహాలు మాయం.. ఇలా అనేక విస‌యాల్లో యాక్టివ్‌గానే ఉన్నా.. మ‌ధ్య‌లో కొంత మౌనంగా ఉండాల్సి వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడు కొస‌రు నేత‌లు.. మాత్రం రెచ్చి పోరుతున్నారు.

సుజ‌నా చౌద‌రి నుంచి సీఎం ర‌మేష్ వ‌ర‌కు నాయ‌కులు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ప్ర‌భుత్వంపై పోరు చేస్తామ‌ని.. తేల్చి చెబుతున్నారు. మ‌రి దీనికి రీజ‌నేంటి? అంటే.. పైనుంచి వ‌చ్చిన ఆదేశాలేలే.. అనే వార్త‌లు నిజ‌మ‌వుతున్నాయి. మొత్తానికి కొస‌రు నేత‌ల దూకుడుతో అస‌లు మ‌ళ్లీ సైలెంట్ అయ్యారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.