Begin typing your search above and press return to search.
మూడు రాజధానులు సక్సెస్ కాలేక పోవడానికి రీజనేంటి..?
By: Tupaki Desk | 15 Oct 2022 8:30 AM GMTఏదైనా ఒక సంచలన నిర్ణయం తీసుకుంటే.. అది సక్సెస్ రేటు సాధించాలి. అది వ్యక్తిగతమైనా.. మరొకటై నా.. ప్రజల నోళ్లలో నానాలి. అప్పుడే అది సక్సెస్ అవుతుంది. మూడు రాజధానుల విషయాన్ని తీసుకుం టే.. ఇప్పుడు.. వివాదంతో పాటు.. విశ్లేషణలకు కూడా.. కారణమైంది. అయితే.. దీనిపై ప్రజలకు ఉన్న అవగాహన ఏంటి? అనేదే ప్రధాన ప్రశ్న. ఎందుకంటే.. మూడు రాజధానులు కావాలని.. వైసీపీ, వద్దని టీడీపీ, రాజధాని రైతులు.. వాదనలు వినిపిస్తున్నారు.
మరి వాస్తవానికి మూడు రాజధానులపై ప్రజలు ఏమనుకుంటున్నారు? అనేది ప్రశ్న. ఎందుకంటే.. అస లు ప్రజల అభ్యున్నతి కోసమే కదా.. సీఎం జగన్ చేస్తున్నదని వైసీపీ నాయకులు చెబుతున్నది. మరి అది ప్రజల్లోకి వెళ్లిందా? ప్రజలకు-మూడు రాజధానుల ఇష్యూ కనెక్ట్ అయిందా? అంటే లేదనే చెప్పాలి. ప్రస్తుతం ప్రజల మూడ్.. మూడు రాజధానుల కంటే కూడా.. అభివృద్ధిపైనే ఉంది. అంతేకాదు.. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. పాలనపైనే ఉంది.
ఈ నేపథ్యంలో మూడు రాజధానుల గురించి ఆలోచించే తీరిక.. చర్చ చేసే సమయం కూడా ప్రజలు లేద నేది వాస్తవం. ''మూడు రాజధానుల మాట పక్కన పెట్టండి. ఉన్నదానిని నిర్మించమనండి'' అనే వారు పెరుగుతున్నారు. అంతేకాదు.. మరికొందరు ఏకంగా.. రోడ్లు వేయడానికే దిక్కులేదు.. అంటూ.. వ్యంగ్యా స్త్రాలు సంధిస్తున్నారు. రాష్ట్ర ప్రబుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు కేంద్రం నుంచి ఎలాంటి అనుమ తులు రానప్పుడు.. ఇదెలా సాధ్యమనే వారు కూడా ఉన్నారు.
ఇంకోవైపు.. మూడు రాజధానుల ఏర్పాటుపై మంత్రులు కానీ.. ఎమ్మెల్యేలు కానీ.. ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నం చేయడం లేదు. వాస్తవానికి గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని కూడా ప్రస్తావించి ఉంటే.. వేరేగా ఉండేది.
అప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయం అందరికీ స్పష్టంగా అర్ధమై ఉండేది. కానీ, అలాగ కూడా వ్యవహరించడం లేదు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రాజధానుల విషయంపై పెద్దగా అవగాహన లేదనే చెప్పాలి. దీనికి తోడు రైతుల సెంటిమెంటు బాగా వర్కవుట్ అవుతుండడం గమనార్హం. మరి వైసీపీ నేతలు ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.