Begin typing your search above and press return to search.
ఈయన ఇలా మారడానికి కారణమేంటంటే..?
By: Tupaki Desk | 16 April 2022 11:30 PM GMTకాలంతో పాటు సమాజంలో వస్తున్న మార్పులకు కొందరు మనుషులు తట్టుకోలేకపోతున్నారు. జీవితంపై విరక్తి చెందిన ఏదేదో చేసేస్తున్నారు. మనుషులతో సమానంగా ఉండడం ఎందుకని అనుకుంటారో.. ఏందో గానీ.. కొందరు చేష్టలు వింతగా ఉంటాయి. ప్రకృతి విరుద్ధంగా జీవితాన్ని గడుపుతూ ప్రత్యేకంగా ఉంటారు. అయితే అలా ఉండడం వారికి బాగానే ఉంటుంది. కానీ ఇతరులు ఇబ్బందులు పడుతారు. అంతేకాదు ఒక్కోసారి వారి ప్రవర్తను చూసి భయపడుతారు. లేటుస్టుగా ఓ వ్యక్తికి మనుషుల కంటే రాక్షసులే నయమని అనిపించినట్లుంది. అందుకే రాక్షసుడిలా మారిపోయాడు. తన అవయావలన్నీ మార్చుకొని భయంకరంగా తయారయ్యాడు. ఇప్పుడు ఆయన ఫొటో ఒకటి నెట్టింట్లో ప్రసారమవుతూ గుబులు పుట్టిస్తోంది. ఆయన ఫొటో చూసిన వారు కొందరు తమకు నిద్రపట్టడం లేదని కామెంట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది.
బ్రెజిల్ కు చెందిన మిచెల్ ఫారో ప్రాడో స్నాప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన అవతరాం చూసి ఇతను మనిషేనా..? అని అంటున్నారు. మరి అంత భయంకరంగా ఉంది ఆయన ఫేస్. ఇటీవల కరోనా వచ్చి ప్రపంచాన్ని కుమ్మేసింది.
బ్రెజిల్ కూడా కరోనా బాధిత దేశాల్లో ఒకటిగా ఉంది. అంతేకాదు మిగతా దేశాల కంటే బ్రెజిల్ బాగా నష్టపోయింది. అయితే అప్పటి నుంచి ఫారో ఫ్రాడ్ కు జీవితంపై విరక్తి పుట్టిందట. ఇక అతను మనిషిలా కాకుండా రాక్షసుడిలా మారలనుకున్నాడు. దీంతో తన అవతరాన్ని మార్చుకున్నాడు. ఏకంగా 60 సర్జరీలు చేయించుకున్నాడు.
కరోనా అంతమైందని భావించిన బ్రెజిల్ ప్రభుత్వం మాస్కులను ధరించడం ఎత్తివేసింది. దీంతో ముందుగా అతని చెవులను కత్తిరించుకున్నాడు. ఆ తరువాత వేళ్లను కట్ చేయించుకున్నాడు.
తనకు తానుగా సైతాన్ అని ప్రకటించుకొని ముక్కు సర్జరీ కూడా చేయించుకున్నాడు. నాలుకను రెండు భాగాలు చేయించుకొని మాట్లడానాకి వీలు లేకుండా చేశాడు. మొత్తంగా ఆయన 60 సర్జరీలు చేయించుకొని అచ్చం రాక్షసుడిలా మారిపోయాడు.
ఆయన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన ఫొటో చూసి చాలా మంది భయపడిపోతున్నారు. ప్రపంచంలో ఇంతకంటే భయంకరమైన వ్యక్తి ఉండరని కొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆయన ఇలా మారడానికి కరోనాతో సమాజంపై విరక్తి పుట్టిందని కొందరు అంటున్నా.. కారణం అదికాదని అంటున్నారు. ఏదో బలమైన కారణం అయన మనసును గాయపరిచిందని అందుకే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.