Begin typing your search above and press return to search.
భారత్, రష్యా మైత్రి బంధానికి కారణమేంటి..?
By: Tupaki Desk | 10 March 2022 11:30 PM GMTరష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం విషయంలో భారత్ వైఖరి ఇప్పటికే స్పష్టం చేసింది. ఏ దేశానికి పూర్తిగా మద్దతు ఇవ్వకుడా తటస్థంగా వ్యవహరించింది. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇటు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కు ఫోన్ చేసి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలిలో రష్యాకు వ్యతిరేకంగా ఓటింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఓటింగ్లో భారత్ పాల్గొనలేదు. ఇందులో అనుకూలంగా 145 దేశాలు వ్యతిరేకంగా 5 దేశాలు ఓటింగ్ చేశాయి. భారత్ తో సహా 35 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉంది. ఇప్పటి వరకు మూడుసార్లు ఓటింగ్ నిర్వహించినా భారత్ దూరంగానే ఉంది. దీంతో భారత్ పై యూరోపియన్ దేశాలు తీవ్రంగా చర్చించుకుంటున్నాయి. అయితే భారత్ రష్యాకు వ్యతిరేకంగా ఎందుకు ఓటేయడం లేదు..? అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
భారత్, రష్యాల మధ్య మైత్రి బంధం ఈనాటిది కాదు. ఎంతోకాలంగా భారత్, రష్యాలు స్నేహపూర్వకంగానే మెలుగుతున్నాయి. ఈ బంధాన్ని ప్రస్తుత ప్రధానమంత్రి మోదీ సైతం అలాగే కొనసాగించారు. విదేశీయుల దౌత్య వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరిస్తున్న మోదీ తాజా యుద్ధం విషయంలోనూ దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఓ వైపు ఉక్రెయిన్ భారత్ పై ఒత్తిడి చేస్తున్నా.. తొందరపడకుండా రష్యాకు అనుకూలంగానే ఉంటూ వస్తోంది. విదేశీ వ్యవహారాలో అమెరికాతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్న భారత్.. పెద్దన్న కంటే రష్యాకే ప్రిఫరెన్స్ ఇవ్వడం విశేషం.
ఇందుకు బలమైన కారణంగా ఒక్కటి చెప్పుకోవచ్చు. 1971 నాటి ఇండో పాకిస్తాన్ యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. ఈ యుద్ధ సమయంలో బంగ్లాదేశ్ విషయంలో భారత్ కలగజేసుకొని పాకిస్తాన్ పై యుద్ధం చేసింది. 13 రోజుల పాటు వీరోచిత యుద్ధం చేసిన 93 వేల మంది పాక్ సైనికులను మట్టుపెట్టింది. అయితే భారత్ పాక్ యుద్ధ సమయంలో అమెరికా.. పొరుగు దేశం పక్షాన నిలిచింది. ఈ యుద్ధంలో జపాన్ కు సమీపంలో ఉన్న అమెరికాకు చెందిన నౌకాదళానికి చెందిన ఏడో నౌకాదళాన్ని పాకిస్తాన్ కు పంపే ప్రయత్నం చేసింది.
అప్పటి అమెరికా అధ్యక్షుడు విక్సన్, భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీల మధ్య సత్సంబందాలే ఉన్నాయి. కానీ యుద్ధ సమయంలో అమెరికా ఇలాంటి ప్రయత్నం చేయడం భారత్ కు నచ్చలేదు. అయితే ఇదే సమయంలో సోవియట్ యూనియన్ (రష్యా) నుంచి భారత్ సాయం కోరింది. దీంతో వెంటనే రష్యా స్పందించింది. అమెరికా నావికాదళం బంగాళాఖాతం వైపు వస్తున్న వేళ రష్యాకు చెందిన అణు సామర్థ్యం గల జలంతార్గములను, డిస్ట్రాయిర్లను పసిపిక్ మహా సముద్రం నుంచి హిందూ మహాసముద్రంలోకి పంపింది. దీంతో అమెరికాకు చెందిన పీఎన్ఎస్ ఘాజీని విశాఖపట్నం సమీపంలో భారత నౌకాదళం ముంచేసింది. దీంతో 1971 డిసెంబర్ 16న పాకిస్తాన్ సైన్యం భారత్ ముందు లొంగిపోయింది.
అమెరికానే కాకుండా చాలా దేశాలు ఆ సమయంలో పాకిస్తాన్ కు మద్దతుగా నిలిచాయి. అప్పుడు అమెరికా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కాల్పుల విరమణ తీర్మానం తీసుకొచ్చి పాకిస్తాన్ పక్షాన నిలిచింది. కానీ అదే సమయంలో రష్యా... భారత్ కు సాయం చేసింది. రష్యా వీటో అధికారాన్ని ఉపయోగించి భారత్ పక్షాన నిలిచింది. అందుకే అమెరికా, ఇతర దేశాల కంటే రష్యా పక్షాన భారత్ ఎప్పుడూ వెన్నంటే ఉంటూ వస్తోంది.
తాజాగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత విద్యార్థులను తరలించడం కోసం యుద్ధం విరామం ఇవ్వాలని కోరగా పుతిన్ వెంటనే స్పందించారు. దీంతో ఆరు గంటల పాటు యుద్ధానికి విరామం ప్రకటించి విద్యార్థులు భారత్ కు తరలేలా సాయం చేశారు.