Begin typing your search above and press return to search.
మహబూబ్‌నగర్‌పై మంత్రి గడబిడ.. రీజనేంటి?
By: Tupaki Desk | 23 July 2022 2:30 PM GMTమహబూబ్‌నగర్‌లో రాజకీయ పరిణామాలు మలుపులు తిరుగుతున్నాయి. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంపై బలంగా దృష్టి సారించిన ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. టీఆర్‌ఎస్ నుంచి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ భిన్నమైన వ్యూహం అమలు చేస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ స్థానం నుంచి గెలుపొందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా 57 వేల మెజార్టీతో గెలుపొందారు.
అయితే వెంటనే జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు సుమారు ఆరువేల ఓట్ల మెజారిటీ లభించడంతో అప్పటి నుంచి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నియోజకవర్గంలో రాజకీయ కార్యాచరణ రూట్ మార్చారు. నియోజకవర్గమంతా ఒకే విధానం కాకుండా, ఎక్కడికక్కడ భిన్నమైన వ్యూహాలను అమలు చేస్తున్నారు. 30 శాతం ఓటర్లున్న గ్రామీణ ప్రాంత ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల్లో క్రియాశీలక ద్వితీయశ్రేణి నాయకులను పార్టీలోకి చేర్చుకుంటున్నారు.
అదేసమయంలో తనకంటూ ప్రత్యేక అనుచరవర్గాన్ని తయారు చేసుకున్నారు. గ్రామాల్లో దాదాపు ప్రతి 30 నుంచి 50 మంది ఓటర్లకు ఒక క్రియాశీలక కార్యకర్త ఉండేలా ప్రత్యేక దృష్టి సారించారు. ద్వితీయ శ్రేణి, గ్రామ నాయకులతో సంబంధం లేకుండా ఆయా కార్యకర్తలతో నేరుగా నిత్యం అనుసంధానమై ఉంటున్నారు. వారి ద్వారా ఎప్పటికప్పుడు సమస్యలు, రాజకీయ మార్పులను పసిగడుతూ అందుకను గుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు.
గతంలో ఎన్నికల సమయంలో తప్ప ఇతర సమయాల్లో రాజకీయ పార్టీలను పట్టించుకోని పలు వృత్తి పనుల కార్మికులు, ఆయా సంఘాలు ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లోకి చేరు తుండడం వెనుక మంత్రి ప్రత్యేక వ్యూహం కనిపిస్తోంది. ఒకవైపు ఈ వ్యూహం అమలు చేస్తూనే, మరోవైపు సంస్థాగతంగా బలంగా ఉన్న బీజేపీతో ఢీ అంటే ఢీ అనేలా కార్యచరణ కొనసాగిస్తున్నారు.
నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన ఒక సామాజికవర్గం నుంచి వ్యతిరేకత ఉన్న విషయా న్ని గమనించి, ఇటీవల ఆ సామాజిక వర్గానికి బాగా దగ్గరయ్యేలా ప్రయత్నాలు చేశారు.
కీలక నాయకుల ను తనవైపు తెచ్చుకొని వారికి క్రియాశీలక పదవులివ్వడంతో పాటు, ఆ సామాజికవర్గం నుంచి తనవైపు వచ్చిన నాయకులను రాజకీయంగానూ ప్రోత్సహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సదరు మంత్రి వేస్తున్న అడుగులను నేతలు నిశితంగా గమనిస్తున్నారు.