Begin typing your search above and press return to search.

గోల్డ్ స్కాం: ఎవరీ స్వప్నాసురేష్!

By:  Tupaki Desk   |   10 July 2020 5:29 PM GMT
గోల్డ్ స్కాం: ఎవరీ స్వప్నాసురేష్!
X
గత కొద్దిరోజులుగా కేరళ గోల్డ్ స్కాం కేసులో స్వప్నా సురేష్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. యూఏఈ రాయబార కార్యాలయం మాజీ ఉద్యోగి స్వప్న సురేష్. తన కాంటాక్ట్స్‌ను చాలా తెలివిగా ఉపయోగించుకుంటా గల్ఫ్ దేశాల నుండి బంగారాన్ని కేరళకు స్మగ్లింగ్ చేస్తోంది. డిప్లమోటిక్ వీసాలను అడ్డు పెట్టుకొని ఆమె సాగిస్తున్న వ్యవహారం ఇటీవల బట్టబయలయింది. సీఎంవోలో కీలక ఉద్యోగి. దీంతో ఈ కేసు సీఎం పినరాయి విజయన్ మెడకు కూడా చుట్టుకుంది. దీంతో విపక్షాలు పినరాయిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది ఆయన సీటుకు కూడా ఎసరు తెచ్చేలా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

అసలు ఈ స్వప్న ఎవరు, ఆమెతో సిఎంకు ఉన్న సంబంధం ఏమిటి? జూలై 5వ తేదీన కస్టమ్స్ డిపార్టుమెంట్ 30 కిలోల బంగారాన్ని సీజ్ చేసింది. దీనిని తవ్వడంతో స్వప్న పేరు బయటకు వచ్చింది. స్వప్న తండ్రిది తిరువనంతపురంలోని బలరామపురం. తండ్రిలో అబుదాబిలో ఉండేవాడు. ఈమె అక్కడే పెరిగింది. అబుదాబీ ఎయిర్ పోర్టులో పాసింజర్ సర్వీస్ డిపార్టుమెంట్‌లో పని చేసింది. 2010లో కేరళకు వచ్చాక ఇక్కడ పని చేసింది. ఎయిరిండియా సాట్స్‌లో ఉద్యోగం సంపాదించింది. ఆ తర్వాత ఆమె ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించిందని ఆరోపణలు రావడం, ఉద్యోగం పోవడం జరిగింది. ఆమెపై ఎఫ్ఐఆఱ్ నమోదయినప్పటికీ ఇంటరాగేషన్ లేకపోవడం, చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నాయకులతో ఆమెకు ఉన్న పరిచయాల కారణంగా తప్పించుకుందనే విమర్శలు ఉన్నాయి.

ఆ తర్వాత తిరువనంతపురం యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ కాన్సులేట్‌లో ఉద్యోగం సంపాదించింది. ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఉద్యోగం పొందింది. ఈ సమయంలో పరిచయాలు పెరిగాయి. రాజకీయ,, బ్యూరోక్రాటిక్ వర్గాల పరిచయాలు పెంచుకుంది. ఆమెకు వివిధ భాషలు కూడా వస్తాయి. 2019లో షార్జా రాజు కేరళకు వచ్చిన సమయంలో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ హోదాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నది. 2019లో ఆ ఉద్యోగం కూడా పోయింది.

ఆ తర్వాత కేరళ స్టేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌లో బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా ఉద్యోగం సంపాదించింది. ఇటీవల వేటుపడిన ప్రిన్సిపల్ సెక్రటరీతో పరిచయం వల్ల ఈ ఉద్యోగం వచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో ఆమె సీఎం కార్యాలయానికి తరుచూ వచ్చేదట. ఈ కేసు వెలుగు చూసినప్పటి నుండి పరారీలో ఉన్న స్వప్నాసురేష్.. తనకు సంబంధం లేదని చెబుతుండటం గమనార్హం. స్వప్నా సురేష్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కేరళ హైకోర్టు కొట్టి వేసింది. కేంద్ర హోంశాఖ ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించింది.