Begin typing your search above and press return to search.
ఆ కొత్త వ్యక్తి ఎవరు..? ఆయనతో కేసీఆర్ కు సంబంధం ఏమిటి..?
By: Tupaki Desk | 5 Jan 2023 9:31 AM GMTగత కొన్ని రోజులుగా ఓ వ్యక్తి కేసీఆర్ వెంట తిరుగుతున్నారు. సీఎంతో సహా హెలీక్యాప్టర్లో కనిపిస్తున్నారు. కేసీఆర్ ప్రగతిభవన్లో.. ఫాం హౌజ్ లో... ఇలా ఎక్కడ ఉంటే అక్కడ దర్శనమిస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి మెదక్ జిల్లా వాసులకు నిత్యం ఆ వ్యక్తి విందులు ఇస్తున్నారు. అయితే ఆయన ఎవరు అనేది వారికి తెలుసు. కానీ ఇతర వ్యక్తులు మాత్రం ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎప్పుడూ లేదని ఈ వ్యక్తి ఎందుకు ప్రత్యక్షమవుతున్నారు..? అతనితో కేసీఆర్ కు ఎలాంటి సంబంధం ఉంది..? అని ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ఆ వ్యక్తి త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాడట. అదీ కేసీఆర్ సూచించే ఓ స్థానంలో పోటీ చేయబోతున్నాడట. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం..
సీఎం కేసీఆర్ ది కుటుంబ పాలన అని ఇప్పటికే బీజేపీ ఆరోపిస్తోంది. ఆయన తన కుమారుడు, కుమార్తె, మేనల్లుడు కోసమే పార్టీని పెట్టుకున్నారని విమర్శిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ నాయకులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. అన్ని పార్టీల్లోనూ ఇదే జరుగుతోందని కౌంటర్ ఇస్తున్నారు. ఓ వైపు ఈ విమర్శలు వస్తుండగానే కేసీఆర్ ఇప్పుడు తన కుటుంబం నుంచి మరో వ్యక్తిని రంగంలోకి దించుతున్నాడు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు కూడా కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే కేసీఆర్ సూచించే సీటులో ఉన్న వారి పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంతకీ ఆయన ఎవరంటే..?
కేసీఆర్ తో పాటు ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు పార్టీలో కొనసాగుతున్నారు. వీరు మంత్రి పదవుల్లో ఉన్నారు కూడా. ఇక కుమార్తె ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అటే సీఎం భార్య శోభ చెల్లెలి కొడుకు సంతోష్ కూడా రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు వీరితో పాటు మరో వ్యక్తి పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయన ఎవరో కాదు సీఎం సోదరుడు రంగారావు కుమారుడు.
సీఎం సోదరుడు రంగారావుకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. కుమార్తె రమ్యారావు మొదట్లో టీఆర్ఎస్ లో ఉన్నా.. ఆ పార్టీ నాయకులతో విభేదాలు ఏర్పడి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు రంగారావు కుమారుల్లో ఒకరు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
అన్నీ కలిస్తే వచ్చే ఎన్నికల్లో ఆయనకు మెదక్ ఎంపీ లేదా సిద్దిపేట సీటును కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేట ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత మెదక్ ఎంపీ స్థానాన్ని హరీశ్ రావుకు కేటాయించే అవకాశం ఉంది. ఆ తరువాత సిద్దిపేట సీటును రంగారావు కుమారుడికి కేటాయిస్తారని సమాచారం.
ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక సీటు కావాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఈ నేపథ్యలో ఆయనను అక్కడికి పంపించి ఇక్కడి సీట్లను సర్దుబాటు చేయనున్నారు. మొత్తానికి ఆయనకు ఏదో ఒక సీటును కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే రంగారావు కుమారుడు తరుచూ కేసీఆర్ వద్దకు వస్తున్నారట.భవిష్యత్ లో ఎలా ఉండాలనే విషయంపై పాఠాలు నేర్చుకుంటున్నారట. అంతేకాకుండా ఉమ్మడి మెదక్ నాయకులకు విందులు ఇస్తున్నారట. దీంతో ఆయన రావడం ఖాయమే అన్న భావన కలిగిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.