Begin typing your search above and press return to search.
70 ఏళ్ల విక్టోరియా రాణి, 24 ఏళ్ల భారత గుమస్తా మధ్య బంధమేంటి?
By: Tupaki Desk | 29 Jan 2020 3:30 AM GMTఅది 18వ శతాబ్ధం.. బ్రిటీష్ మహారాణి గా విక్టోరియా ఉన్నారు 1837-1901 వరకూ యావత్ ప్రపంచానికి రాణిగా వెలుగొందారు. ఆ క్రమంలో భారత దేశం కూడా బ్రిటీషర్ల చేతిలో ఉండేది. భారత్ కు కూడా రాణి ఆమెనే.
విక్టోరియా మహారాణి కి సేవకులు గా, వంట చేసేందుకు భారత్ లోని అగ్రా నుంచి ఇద్దరు చేయితిరిగిన వంటగాళ్లను బ్రిటీష్ ప్రభుత్వం ఇంగ్లండ్ పంపింది. అందులో ఒకరే అబ్దుల్ కరీం. ఈ 24 కరీం 70 ఏళ్ల విక్టోరియా మహారాణికి అత్యం త ఆప్తుడైన వ్యక్తిగా మారిపోయారు. బ్రిటన్ మహారాణి విక్టోరియా తన జీవితంలో చివరి 13 ఏళ్లలో ఎక్కువ సమయాన్ని భారత గుమస్తా అయిన అబ్దుల్ కరీంతోనే గడపడం విశేషం.
వంటగాడిగా బ్రిటన్ మహారాణి వద్ద చేరిన కరీం.. ఆమెను మనసు ఎరిగి సపర్యలు చేసి ఆమె వ్యక్తిగత గుమస్తా స్థాయికి ఎదిగాడు. కరీం కోసం ఆగ్రాలో 300 ఎకరాలు భూమి, కరీం తండ్రికి పింఛన్ కూడా ఇప్పించాలని బ్రిటన్ రాణి ఆదేశాలు ఇచ్చిందంటే వీరి బంధాన్ని అర్థం చేసుకోవచ్చు.
కరీం మొదట భారత్ నుంచి వెళ్లి నౌకరుగా చేరారు. మెల్లమెల్లగా ఆమెకు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా మారారు. విక్టోరియా అతడితో శారీరక బంధాన్ని కొనసాగించారన్న ప్రచారం సాగింది. అయితే అధికారికంగా ఆ విషయం వారిద్దరికే తెలుసు. ఒక్క క్షణం కూడా విక్టోరియా కరీం లేకుండా ఉండేవారు కాదు.. వీరి బంధంపై రాజమహాల్ లో కథలు కథలుగా చెప్పేవారు..
కరీంపై ఎవరు వద్దన్నా ఎంత వ్యతిరేకత వచ్చినా విక్టోరియా రాణి మాత్రం ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ఆమె ఆ బంధాన్ని జీవితాంతం కొనసాగించారు. విక్టోరియా చనిపోయాక కరీంను ప్యాలెస్ నుంచి తన్ని భారత్ తరిమివేశారు. ఆ తర్వాత భారతీయులను పనిలో పెట్టుకోలేదు రాజ కుటుంబీకులు.. వీరి బంధంపై ఇప్పటికే బ్రిటీష్ రాజకుటుంబంలో ఇంగ్లండ్ లో న్యూస్ వైరల్ గానే అవుతుంటుంది.