Begin typing your search above and press return to search.
హీరోయిన్ ని 200కోట్ల మోసగాడికి పరిచయం చేసిన ఫలితం?
By: Tupaki Desk | 1 Dec 2022 2:09 AM GMT200 కోట్ల దోపిడీ సహా ప్రముఖులను మోసం చేసిన కేసులో అరెస్టయిన కాన్ మాన్ సుఖేష్ చంద్రశేఖర్ మోసాల విలాసాల కథలో ప్రముఖ కథానాయికల గుట్టంతా ఈడీ బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో జాక్విలిన్ ఫెర్నాండెజ్.. నోరా ఫతేహి సహా పలువురు కథానాయికలు టాప్ మోడల్స్ కూడా ఉన్నారని ఈడీ వర్గాల నుంచి సమాచారం అందింది.
ఈ కేసులో ఇప్పటికే జాక్విలిన్ ఫెర్నాండెజ్ ను పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. దేశం విడిచి వెళ్లిపోకుండా ఆంక్షలు విధించారు. విచారణలో తాజా పరిణామం ఏమంటే... జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను సుఖేష్ చంద్రశేఖర్ కు పరిచయం చేసిన పింకీ ఇరానీని అక్రమార్కుడితో ముడిపడి ఉన్న దోపిడీ కేసుకు సంబంధించి పోలీసులు బుధవారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
ముంబైకి చెందిన ఇరానీ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (ఈవోడబ్ల్యూ) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారని ఢిల్లీ పోలీసు అధికార ప్రతినిధి సుమన్ నల్వా తెలిపారు. "పింకీకి వ్యతిరేకంగా తగిన సాక్ష్యాధారాలు లభించిన తర్వాత ఈ కేసులో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. తనను మూడు రోజుల పాటు పోలీసులు రిమాండ్ కి తరలించారు. తదుపరి విచారణ పురోగతిలో ఉంది" అని నల్వా చెప్పారు.
200 కోట్ల మోసం కేసులో ఢిల్లీ పోలీసులతో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంతకుముందే ముఖ్యమైన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. నిందితుడు సుఖేష్ చంద్రశేఖ ర్ కు సంబంధించిన ఈ కేసులో ఢిల్లీ కోర్టు మంగళవారం జాకీకి సాధారణ బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తులో నిందితురాలిని అరెస్టు చేయకుండా ప్రస్తుతానికి జాకీకి సాధారణ బెయిల్ మంజూరు చేసింది. దోపిడీ కేసుకు సంబంధించి ఫెర్నాండెజ్ ను సెప్టెంబర్‌లో EOW (ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్) ప్రశ్నించింది. ప్రస్తుతం జైలులో ఉన్న చంద్రశేఖర్.. ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ వంటి ప్రముఖ వ్యక్తులు సహా పలువురిని మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
చంద్రశేఖర్ తో ముడిపడి ఉన్న కోట్లాది రూపాయల మనీలాండరింగ్ కేసులో ఫెర్నాండెజ్ ను నిందితురాలిగా పేర్కొంటూ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆగస్టు 17న చార్జ్ షీట్ దాఖలు చేసింది. ED పరిశోధన ప్రకారం.. ఫెర్నాండెజ్ తో పాటు మరొక బాలీవుడ్ నటి నోరా ఫతేహి అతని నుండి లగ్జరీ కార్లు ఇతర ఖరీదైన బహుమతులు అందుకున్నారు. ఈ కేసు విచారణలో జాకీ కుటుంబానికి రకరకాల బహుమతులు అందాయని తేలింది. వాటిని ఈడీ ఇంతకుముందే జప్తు చేసిన సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.