Begin typing your search above and press return to search.
అమెజాన్ అధినేత అంతరిక్ష యాత్రలో ప్రత్యేకత ఏమిటి?
By: Tupaki Desk | 21 July 2021 5:45 AM GMTప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తి అయింది. ఈ యాత్ర గురించి ఆయన ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అంతరిక్ష యాత్రకు సంబంధించి తొలి ప్రైవేటు ప్రయాణం తామే చేస్తామని భావించినప్పటికీ.. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ తొమ్మిది రోజుల క్రితమే రోదసియానం చేయటంతో.. ‘ఫస్ట్’ క్రెడిట్ ను మిస్ అయ్యారు. లేటుగా అయినా లేటెస్టుగా అన్న రీతిలో.. వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు మించిన రీతిలో బ్లూ ఆరిజిన్ సంస్థ తన తొలి మానవసహిత రోదసి యానంలో పలు రికార్డుల్ని బ్రేక్ చేసింది.
తాజా పరిణామంతో రోదసియానానికి సంబంధించిన వ్యాపార పోటీ మొదలైనట్లే. ఈ రెండు సంస్థల మధ్య పోటీ రానున్న రోజుల్లో మరింత తీవ్రతరం కానుంది. ఇక.. అమెజాన్ అధినేత అంతరిక్ష యానానికి సంబంధించిన ఆసక్తికర అంశాలు చాలానే ఉన్నాయి. మొత్తం పది నిమిషాల పది సెకన్ల పాటు సాగిన ఈ యాత్ర అనుకున్న రీతిలోనే సజావుగా సాగింది. ప్రపంచ కుబేరుడిగా.. అమెజాన్ వ్యవస్థాపకుడిగా పేరు ప్రఖ్యాతులున్న జెఫ్ బెజోస్ తన అంతరిక్ష స్వప్నాన్ని తాజాగా సాకారం చేసుకున్నారు.
తనతో పాటు 82 ఏళ్ల మహిళ వేలీ ఫంక్.. 18 ఏళ్ల కుర్రాడు ఆలివర్ డేమన్ ను ఈ యాత్రలో పాల్గొన్నారు. దీంతో.. తాజా అంతరిక్ష ప్రయాణంతో అత్యంత పెద్ద వయస్కురాలు.. అతి పిన్నవయస్కుల అంతరిక్ష యానానికి సంబంధించిన రికార్డు బ్లూ ఆరిజన్ సంస్థ సొంతమైంది. అంతేకాదు.. వర్జిన్ గెలాక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ అంతరిక్ష యాత్రకు మించి.. మరింత ఎత్తుకు బెజెస్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. వర్జిన్ గెలాక్టిక్ భూమి నుంచి 90కిలోమీటర్ల ఎత్తుకు మాత్రమే వెళ్లగలిగితే.. ఆమెజాన్ అధినేత తన తాజా యాత్రలో 106 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి.. మరోరికార్డును సొంతం చేసుకున్నారు.
చంద్రుడిపై మానవుడు కాలుమోపిన చరిత్రాత్మక ఘట్టానికి 52 ఏళ్లు పూర్తి అయిన రోజునే బెజోస్ తన అంతరిక్ష పర్యటనను పూర్తి చేశారు. తాజా పర్యటనలో బెజోస్ తో పాటు ప్రయాణించిన వేలీ ఫంక్ ఉదంతం ఆద్యంతం ఆసక్తికరమని చెప్పాలి. ఆమె చిరకాల వాంఛను తీర్చిన ఘనత బెజోస్ కు దక్కుతుంది. ఎందుకంటే.. 1960లో నాసా వద్ద శిక్షణ పొందిన 13 మంది మహిళా వ్యోమగాముల్లో వేలీ ఫంక్ ఒకరు. కానీ.. ఆమెకు అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం లభించలేదు. దాదాపు 60 ఏళ్ల తర్వాత.. ముదిమి వయసులో ఆమెకు దక్కిన అవకాశానికి మురిసిపోతున్నారు.
ప్రయాణం చివరి నిమిషంలో 18 ఏళ్ల ఆలివర్ డేమస్ కు అమెజాన్ అధినేతతో కలిసి ప్రయాణించే అవకాశం లభించింది. ఇందుకోసం అతగాడికి కొంత తక్కువ ధరకే టికెట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తాజా ప్రయాణంతో ఇప్పటివరకు ఉన్న అంతరిక్షయానానికి సంబంధించిన రికార్డులు చెదిరిపోయాయి. ఇప్పటివరకు రోదసిలోకి 600 మంది మాత్రమే వెళ్లి వచ్చారు. అంతరిక్షంలోకి వెళ్లిన అత్యంత చిన్న వయసు రికార్డు గెర్మాన్ టిటోవ్ పేరుతో ఉంది. ఆయన అంతరిక్ష యానం చేసే సమయానికి ఆయనకు పాతికేళ్లు. తాజా టూర్ తో ఆ రికార్డు బ్రేక్ అయ్యింది. ఇక.. 77 ఏళ్ల పెద్ద వయస్కుడైన జాన్ గ్లెన్ ఇప్పటివరకు రికార్డు ఉండగా.. ఆయన కంటే పెద్దదైన 82 ఏళ్ల మహిళ అంతరిక్ష యానం పూర్తి చేసుకొని రావటంతో కొత్త రికార్డు ఆమె పేరిట నమోదైంది.