Begin typing your search above and press return to search.
స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ స్పెషాలిటీ ఏమిటి? దానికి లాన్సెట్ ఇచ్చిన రేటింగ్ ఎంత?
By: Tupaki Desk | 30 March 2021 3:30 PM GMTకోవిడ్ కు వ్యాక్సిన్ రూపొందించే విషయంలో ప్రపంచమంతా కిందామీదా పడే వేళ.. రష్యా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ను తెర మీదకు తీసుకొచ్చింది. నిజానికి ఈ వ్యాక్సిన్ పెను సంచలనమైంది. దీనిపై పాజిటివ్ గా ఎన్ని కామెంట్లు వచ్చాయో.. నెగిటివ్ గా కూడా ప్రచారం జరిగింది. అయితే.. దాని సమర్థత కాల పరీక్షను ఎదుర్కొని నిలిచింది. ఈ వ్యాక్సిన్ ను గమలేయ పరిశోధన సంస్థ డెవలప్ చేసింది. సదరు సంస్థ అధినేత అలెగ్జాండర్ గింట్స్ బర్గ్ చెప్పిన దాని ప్రకారం.. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ అన్ని వయసుల వారి మీదా సమానంగా ప్రభావాన్ని చూపుతుందని.. ఆ విషయం ఇప్పటికే నిరూపితమైందని చెబుతున్నారు. ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన నాలుగు నుంచి ఆరువ్యాక్సిన్లలో స్పూత్నిక్ వీ ఫీచర్ల పరంగా మొదటి స్థానంలో నిలిచినట్లుగా అలెగ్జాండర్ గింట్స్ బర్గ్ చెబుతున్నారు.
దీన్ని భారత్ లో రెడ్డీస్ ల్యాబ్ ఉత్పత్తి చేస్తోంది. మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి (కేంద్రం ఆమోదం పొందిన తర్వాత మాత్రమే) రానుంది. ఈ టీకాకు సంబంధించిన ఫీచర్ల విషయానికి వస్తే కోవిడ్ పై 91.6 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు లాన్సెట్ జర్నల్ వెల్లడించింది. దీని ట్రయల్స్ డాటా ప్రస్తుతం ఇండియన్ రెగ్యులేటర్ వద్ద ఉంది. కొద్ది వారాల్లోనే దీనికి ఆమోద ముద్ర పడుతుందని చెబుతున్నారు.
ఈ వ్యాక్సిన్ పరీక్షల్ని భారత్ లోనూ పలువురిపై ప్రదర్శించారు. ఈ టీకా కూడా రెండు దఫాలుగా ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి మోతాదు ఇచ్చిన 21వ రోజు రెండో డోసు ఇస్తారు. గరిష్ఠంగా రోగ నిరోధక శక్తి 28వ రోజు నుంచి 42వ రోజు మధ్యలో డెవలప్ అవుతుందని చెబుతున్నారు. మాటలు బాగానే ఉన్నాయి.. ప్రభుత్వ ఆమోదం తర్వాత చేతల్లోఈ వ్యాక్సిన్ ఎంత సత్తా చూపుతుందో చూడాలి.