Begin typing your search above and press return to search.

సోమ‌వారం స‌భ‌పైనే స‌ర్వ‌త్రా దృష్టి.. జ‌గ‌న్ వ్యూహం ఏంటి?

By:  Tupaki Desk   |   22 Nov 2021 3:30 AM GMT
సోమ‌వారం స‌భ‌పైనే స‌ర్వ‌త్రా దృష్టి.. జ‌గ‌న్ వ్యూహం ఏంటి?
X
ఏపీ స‌హా దేశం మొత్తాన్ని క‌దిలించి వేసిన `శుక్ర‌వారం అసెంబ్లీ` సంఘ‌ట‌న‌పై వైసీపీ ప్ర‌భుత్వం ఏం చేస్తుంది? ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ దీనిపై ఎలా స్పందిస్తారు? ఎన్న‌డూ మీడియా ముందుకురాని నంద‌మూరి కుటుంబం మొత్తం ఏక‌తాటిపైకి వ‌చ్చి.. శుక్ర వారం అసెంబ్లీలో చంద్ర‌బాబునాయ‌కుడు.. ఆయ‌న స‌తీమ‌ణికి జ‌రిగిన అవ‌మాన్ని తీవ్రంగా ఖండించింది. ఏపీ స‌ర్కారు తీరుపైనా.. వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్య‌ల‌పైనా తీవ్రంగా మండిప‌డింది. ప‌రిస్థితిని మార్చుకోవాల‌ని.. మీ రాజ‌కీయాలు మీరు చేసుకోవాల‌ని.. మ‌ధ్య‌లో మ‌మ్మల్ని ఎందుకు లాగుతార‌ని ప్ర‌శ్నించారు. అదేవిధంగా వివిధ రాజ‌కీయ ప‌క్షాల నుంచి కూడా చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ల‌భించింది.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం ముఖ్యంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ దీని పై ఏం చేస్తారు? ఎలా రియాక్ట్ అవుతారు? అనేది ఆస‌క్తిగా మారింది. అయితే.. ఇంతగా ఊరు వాడ కూడా గ‌గ్గోలు పెట్టినా... తాము ఏమీ అన‌లేద‌ని.. నంద‌మూరి కుటుంబాన్ని మేం ఒక్క మాట కూడా విమ‌ర్శించ‌లేదని.. అస‌లు మాకు ఆ అవ‌స‌రం ఏంట‌ని.. మంత్రులు పేర్ని నాని, బాలినేని శ్రీనివాస్ స‌హా.. ఈ వివాదంలో టీడీపీ ఎవ‌రి వైపు వేలు పెట్టి చూపిస్తోందో.. వారు... అంబ‌టి రాంబాబు, ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి వంటి వారు చెప్పుకొచ్చారు.. ఎద‌రు చంద్ర‌బాబే త‌మ‌ను రెచ్చ‌ గొట్టార‌ని.. క‌నీసం ప‌శ్చాత్తాపం కూడా వ్య‌క్తం చేయ‌ కుండా.. ఎదురు దాడికి దిగారు. ఇది మ‌రింత‌గా వైసీపీ గ్రాఫ్‌ను ప‌డేసిన‌ట్టు అయింది.

మ‌రో వైపు.. శుక్ర‌వారం అసెంబ్లీ ఘ‌ట‌న‌ పై నేరుగా జ‌గ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో... తాము చూడాల‌ని అనుకుంటామ‌ని.. ఆయ‌న స్పంద‌న కోసం ఎదురు చూస్తున్నామ‌ని.. నంద‌మూరి కుటుంబం ప్ర‌క‌టించింది. అదే స‌మ‌యంలో ప్ర‌జ‌లు కూడా.. అస‌లు ఇంత‌గా బ‌రి తెగించ‌డం ఏంటి? అని ప్ర‌శ్న‌లు వైసీపీ నేత‌ల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. సోష‌ల్ మీడియా లోనూ దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ నేత‌ల‌కు ప్ర‌జ‌ల‌కు ముఖాలు చూపించ‌లేని ప‌రిస్తితి ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హిళ‌ల‌కుతాము ఎన్నో చేస్తున్నామ‌ని.. ప‌ద‌వులు ఇస్తున్నామ‌ని.. కీల‌క‌మైన హోం శాఖ వంటివాటిని కూడా అప్ప‌గించామ‌ని చెబుతున్న నేత‌ల‌కు తాజాగా శుక్ర‌వారం అసెంబ్లీ ఘ‌ట‌న సెగ పుట్టిస్తోంది.

ఈ అసెంబ్లీ వ్య‌వ‌హారాన్ని కేవలం చంద్ర‌బాబు పై దాడి గానే కాకుండా.. యావ‌త్ మ‌హిళా లోకం పై జ‌రిగిన దాడిగా.. ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఇది నిజానికి వైసీపీ ఎక్స్‌పెక్ట్ చేయ‌లేదు. ఏదో చంద్ర‌బాబు క‌న్నీరు పెట్టుకున్నారు. రాజ‌కీయం గా దీనిని ఎదుర్కొందాం.. అనుకున్నారే త‌ప్ప‌.. ఎవ‌రూ కూడా ఇది ఇంత పెద్ద సెంటిమెంటు గా మారుతుంద‌ని.. అనుకోలేదు. కానీ, ఇప్పుడు మ‌హిళ‌ల్లో జ‌గ‌న్ ప‌ట్ల ఒక‌ విధ‌మైన అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇటీవ‌లే.. ఆయ‌న సోద‌రి ష‌ర్మిల కూడా త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌ని .. పేర్కొన‌డం.. త‌ల్లి విజ‌య‌మ్మ కూడా.. జ‌గ‌న్‌కు దూరంగా ఉండ‌డం వంటి ప‌రిణామాల్లో అస‌లు మ‌హిళ‌ల విష‌యంలో జ‌గ‌న్ చిత్త‌శుద్ధి ఏంటి? అనే ప్ర‌శ్న చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఈ నేప‌థ్యం లో జ‌గ‌న్ సోమ‌వారం అయినా.. దీని పై స్పందిస్తారా?
జ‌రిగిన ఘ‌ట‌న‌ పై చ‌ర్య‌లు తీసుకుంటారా? అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి చూడాలి ఏం చేస్తారో!