Begin typing your search above and press return to search.
అప్పుల లెక్క పక్కన పెడదాం.. బ్యాంకుల్లో ప్రజలు దాచిన మొత్తం లెక్కేంటి?
By: Tupaki Desk | 22 Sep 2022 3:30 AM GMTఎప్పుడూ నెగిటివ్ నేనా? పాజిటివ్ ఉండదా? అంటూ మీడియాలో వచ్చే వార్తల మీద కొందరు విశ్లేషణ చేస్తుంటారు. మరికొందరు తమకు తోచిన రీతిలో క్లాసులు పీకుతుంటారు.నిజమే.. పాజిటివ్ వార్తలు ఉండాల్సిందే.కానీ.. ఆ పాజిటివ్ వార్తలకు మూలం నెగిటివ్ వార్తలే అన్న విషయాన్ని చాలామంది పట్టించుకోరు. ఇంతకాలం తలసరి అప్పు .. తలసరి ఆదాయం గురించి మాత్రమే లెక్కలు విన్నాం.
మరి.. తలసరి పొదుపు మాటేమిటి? ప్రభుత్వం కానీ ప్రైవేటు కానీ బ్యాంకుల్లో మన దేశ ప్రజలు దాచుకున్న మొత్తం ఎంత? దాని విలువ ఎంత ఉంటుంది? లాంటి లెక్కలకు సంబంధించిన వివరాల్ని తాజాగా ఆర్ బీఐ విడుదల చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే ఈసారి 1983 నుంచి 2021 వరకు బ్యాంకుల్లో భారతీయులు డిపాజిట్ చేసిన సొమ్ము లెక్కల్ని వెల్లడించింది.
ఇండియన్ ఎకానమీ స్టాటిస్టిక్స్ పేరుతో రిజర్వు బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం.. వివిధ బ్యాంకుల్లో దేశ పరజలు దాచుకున్న సొమ్ము అక్షరాల రూ.1, 35,59,212 కోట్లు. చదవటానికి ఇబ్బందిగా అనిపిస్తే.. సింపుల్ గా చెప్పేయాలంటే రూ.1.35 కోట్ల లక్షల కోట్లుగా చెప్పాలి. ఈ మొత్తాన్ని దేశ ప్రజలకు పంచితే.. ఒక్కొక్కరి సొమ్ము సమారు లక్ష రూపాయిలుగా తేలుతుంది. మరో కీలకమైన అంశం ఏమంటే..దేశీ బ్యాంకుల్లోనే కాదు విదేశీ బ్యాంకుల్లోనూ దాచే సొమ్ము కూడా భారీగాపెరిగినట్లు చెబుతున్నారు.
1983-84లో భారతీయులు దాచుకున్న పొదుపు మొత్తం విలువ రూ.17,811 కోట్లు అయితే.. అందులో భారతీయ బ్యాంకుల్లో 17,430 కోట్లుగా ఉండగా.. విదేశీ బ్యాంకుల్లో రూ.381 కోట్లు దాచుకున్నట్లుగా తేలింది. పదేళ్ల తర్వాత ఈ పొదుపుసొమ్ము రూ.71,151 కోట్లకు పెరిగింది. 2014లో విదేశీ బ్యాంకుల్లో రూ.41,046 కోట్లు దాచితే.. 2021-22 నాటికి అది కాస్తా రూ.87,284 కోట్లకు చేరింది. 1983నాటికి విదేశీ బ్యాంకుల్లోభారతీయులు దాచుకున్న మొత్తం రూ.381 కోట్లు అయితే.. ఇప్పుడీ మొత్తం ఎంత భారీగా పెరిగిందో ఇట్టే అర్థమవుతుంది.
ఇక.. బ్యాంకుల్లో దాచుకునే వారంతా తమ డబ్బును డిపాజిట్ల రూపంలో ఉంచేందుకు మక్కువ చూపుతున్నట్లు తేలింది. అత్యధికులు 5 ఏళ్లకు పైనే ఫిక్సెడ్ డిపాజిట్లకు ఎక్కువ మక్కువ చూపుతున్నట్ులగా తేలింది.అయితే.. తొంభైరోజుల టర్మ్ డిపాజిట్లతో పోలిస్తే ఆరునెలల నుంచి ఏడాది మధ్య కాలానికి తీసుకునే టర్మ్ డిపాజిట్లలోనూ ఎక్కువగానే దాస్తుండటం గమనార్హం. 1998లో 90రోజుల్లోపు టర్మ్ డిపాజిట్ల విలువ రూ.41,365 కోట్లు కాగా.. 2008 నాటికి అది రూ.1.51 లక్షల కోట్లకు చేరింది. 2021-22 నాటికి రూ.13,02,760కు చేరింది.
ఐదేళ్ల కంటే ఎక్కువ కాల వ్యవధి ఉన్న టర్మ్ డిపాజిట్లు 1998లో రూ.46,231 కోట్లు ఉంటే.. 2008నాటికి రూ.1.65 లక్షలకోట్లకు.. 2018 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరాయి. కానీ.. 2021 నాటికి మాత్రం రూ.7.47 లక్షలకోట్లకు తగ్గటం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.