Begin typing your search above and press return to search.

ఆ టీఆర్ఎస్ సీనియ‌ర్ ఫ్యూచ‌ర్ ఏంటో ?

By:  Tupaki Desk   |   6 May 2021 11:30 PM GMT
ఆ టీఆర్ఎస్ సీనియ‌ర్ ఫ్యూచ‌ర్ ఏంటో ?
X
తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌లో సీనియ‌ర్ల ప‌రిస్థితి రోజు రోజుకు ముందు నుయ్యి.. వెన‌క గొయ్యి అన్న చందంగా మారుతోంది. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత.. అంత‌కు ముందు కీల‌క పాత్ర పోషించిన సీనియ‌ర్లు ఇప్పుడు క్ర‌మ‌క్ర‌మంగా కొంద‌రు తెర‌మ‌రుగు అవుతుంటే.. మ‌రి కొంద‌రిని వ్యూహాత్మ‌కంగా ప‌క్క‌న పెట్టేస్తున్నారా ? అన్న సందేహాలు వ‌స్తున్నాయి. ఇక ఉద్య‌మ కాలం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉన్న తాజా మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ను మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేస్తేనే దిక్కూ దివాణం లేదు... ఇక మిగిలిన సీనియ‌ర్ల ప‌రిస్థితి ఎలా ఉంటుందో ? ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఈ క్ర‌మంలోనే ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత‌, మాజీ డిప్యూటీ సీఎం క‌డియం శ్రీహ‌రి వారి పరిస్థితి ఏంటి అని రాజకీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. తొలి ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌నిచేసిన ఆయ‌న‌కు ముంద‌స్తు సాధార‌ణ ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వ‌లేదు. ఆ త‌ర్వాత ఏర్ప‌డిన ప్ర‌భుత్వంలో ఖ‌చ్చితంగా త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆయ‌న అనుకున్నారు. కేసీఆర్ ఆయ‌న్ను ప‌ట్టించుకోలేదు.

అంతెందుకు ఎన్నిక‌ల్లో ఓడిన సీనియ‌ర్ నేత‌ తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావును ప‌క్క‌న పెట్ట‌డంతో పాటు గ‌తంలో మంత్రిగా ఉన్న మ‌రో సీనియ‌ర్‌ పోచారంను స్పీక‌ర్ చేసి సైడ్ చేసేశారు. ఇలా సీనియ‌ర్ నేత‌ల‌ను వ్యూహాత్మ‌కంగా ప‌క్క‌న పెడుతూ వ‌స్తున్నారు. ఇక ఇప్పుడు క‌డియం శ్రీహ‌రి వంతు వ‌చ్చింది. ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌వి మ‌రో మూడు నెల‌ల్లో ముగియ‌నుంది. కడియం శ్రీహరి 2014లో వ‌రంగ‌ల్ ఎంపీగా గెలిచారు. ఆ త‌ర్వాత రాజ‌య్య‌ను భ‌ర్త‌ర‌ఫ్ చేసిన‌ప్పుడు కేసీఆర్ క‌డియంను మంత్రిని చేసి.. ఆ త‌ర్వాత ఎమ్మెల్సీని చేశారు.

ఇక 2018లో టిక్కెట్ ఇవ్వ‌లేదు స‌రిక‌దా ? ఆ త‌ర్వాత మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు.. ఆయ‌న ఎమ్మెల్సీగా ఉన్నా ఎలాంటి ప్ర‌యార్టీ లేదు. వాస్త‌వంగా చూస్తే తెలంగాణ‌లో క‌డియం సామాజిక వ‌ర్గం ఎక్కువుగా ఉంది. కేసీఆర్ ఆయ‌న ప‌ద‌విని రెన్యువ‌ల్ చేయాల‌నుకుంటే చేయ‌వ‌చ్చు. అయితే సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెడుతోన్న క్ర‌మంలో క‌డియం ప‌రిస్థితి కూడా అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క మాదిరిగానే ఉందంటున్నారు. క‌డియంకు ఎమ్మెల్సీయే రెన్యువ‌ల్ అవుతుందా ? లేదా ? అన్న సందేహం ఉంటే ఆయ‌న ఏకంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రి అవ్వాల‌ని కోరుకుంటున్నార‌ట‌.