Begin typing your search above and press return to search.
రజినీ-కమల్ కలిస్తే జరిగే అద్భుతమేంటి?
By: Tupaki Desk | 23 Nov 2019 8:58 AM GMTరెండు విభిన్న దారులు ఒక్కటయ్యాయి.. తమిళనాడు పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నాయి. తమిళనాడు అగ్రహీరోలు కమల్ హాసన్, రజినీకాంత్ లు ఒక్కటి కాబోతున్నారు. హేతువాది, కమ్యూనిస్టు, దేవుడిని అస్సలు నమ్మే కమల్ హాసన్.. పూర్తిగా దైవభక్తి గల ఆధ్యాత్మికవాది రజినీకాంత్ కలవబోతున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తాను 2021లో తమిళనాడు రాజకీయాల్లోకి వస్తున్నానని రజినీకాంత్ ప్రకటించారు. తన మిత్రుడు కమల్ హాసన్ తో పార్టీ నేతల అభిప్రాయాల ప్రకారం అవసరమైతే కలిసి పోటీ చేస్తామన్నారు. ఈ క్రమంలోనే సీఎం ఎవరు అవుతారనే ప్రశ్నకు 2021 ఎన్నికల్లో తమిళ ప్రజలు అద్భుతాన్ని సృష్టించబోతున్నారని రజినీ వ్యాఖ్యానించారు.
రజినీ కామెంట్స్ తమిళనాట అధికార, ప్రతిపక్షాలను షేక్ చేశాయి. ముఖ్యంగా తమిళనాడు సీఎం ఫళని స్వామి తాజాగా రజినీకాంత్ వ్యాఖ్యల పై సెటైర్లు వేశారు. రజినీకాంత్ పేర్కొన్న మహాద్భుతం రాబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలుపేనని ఎద్దేవా చేశారు.
ఇక అన్నాడీఎంకే పత్రిక లో, ఆ పార్టీ నేతలు సైతం రజినీ-కమల్ కలయికను తూర్పారపట్టారు. పిల్లి, ఎలుకలు ఎలా కలుస్తాయని సెటైర్లు వేశారు.
ఇలా రజినీకాంత్ రాజకీయ ప్రవేశం తమిళనాట అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంలను కలవరపెడుతోంది. కమల్ తో కలిసి రజనీకాంత్ పోటీచేస్తే మాత్రం వీరి గెలుపు గ్యారెంటీ అన్న అంచనాలున్నాయి. మరి బలమైన అన్నాడీఎంకే, డీఎంకేలను ఎదుర్కొని ఈ ఇద్దరు స్టార్ హీరోలు తమిళనాట ఎలాంటి అద్భుతాన్ని సృష్టిస్తారనేది వేచిచూడాలి.