Begin typing your search above and press return to search.

'మ‌నంద‌రి ప్ర‌భుత్వ' ప్ర‌జ‌ల మాటకు విలువేదీ?

By:  Tupaki Desk   |   26 March 2022 11:30 PM GMT
మ‌నంద‌రి ప్ర‌భుత్వ ప్ర‌జ‌ల మాటకు విలువేదీ?
X
ఏపీ సీఎం జ‌గ‌న్ త‌ర‌చుగా ఇదే మాట చెబుతూ ఉంటూ.. `మ‌నంద‌రి ప్ర‌భుత్వం`... అంటూ.. ఆయ‌న త‌ర‌చు గా వ్యాఖ్యానిస్తుంటారు. ప్ర‌జ‌ల దీవెను.. ఆ దేవుడి ద‌య‌.. మ‌నంద‌రి ప్ర‌భుత్వంపై ఉన్నాయ‌ని కూడా చెబు తూ ఉంటారు. బ‌హుశ‌.. ఈ మాట దేశంలోని ఏ రాష్ట్ర ప్ర‌భుత్వ మూ కూడా అని ఉండ‌దు. నిజ‌మే! ఒక వేళ అన్నా కూడా.. ఎన్నిక ల‌స‌మ‌యంలోనే అని ఉంటాయి. కానీ, ఏపీలో మాత్రం తెల్లారి లేస్తే.. ఏ కార్య‌క్ర‌మంలో అయినా.. సీఎం జ‌గ‌న్ మ‌నంద‌రి ప్ర‌భుత్వం అంటూ.. సెంటిమెంటును రాజేసేందుకు ఎక్కువ స‌మ‌యం కేటాయిస్త‌న్నారు.

అయితే.. మ‌నంద‌రి ప్ర‌భుత్వంలో ప్ర‌జ‌ల‌కుఉన్న‌విలువ ఏంటి? నిజంగానే ఇది మ‌నంద‌రి ప్ర‌బుత్వ‌మే అయితే.. అన్ని వైపుల నుంచి వ‌స్తున్న ప్ర‌జ‌ల‌డిమాండ్ల‌కు, ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు విలువ వుండాలి క‌దా? అనేది మేధావుల మాట‌. ఎందుకంటే... జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన మూడు కీల‌క‌నిర్ణ‌యాల‌పై.. ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు కూడా జ‌రుగుతున్నాయి.

ప్ర‌జ‌ల నుంచి ఛీత్కారాలు కూడా ఎదుర‌వుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ మొండిగాముందుకు సాగుతున్నార‌ని.. మేధావులు చెబుతున్నారు.

మ‌రి మ‌నంద‌రి ప్ర‌భుత్వ‌మే అయితే.. ఆయా అంశాల‌పై ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించేందుకు లేదా.. ఆయా నిర్ణ‌యాల‌ను వెన‌క్కి తీసుకునేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించాలి క‌దా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఇక‌, ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌ను గ‌మ‌నిస్తే,. ఒక‌టి చెత్త‌పై ప‌న్ను. ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఎక్క‌డా చెత్త‌పై ప‌న్నును వ‌సూలు చేయ‌డం లేదు. వాస్త‌వానికి ఇది ప్ర‌పంచ బ్యాంకు నిర్ణ‌యం. అందుకే.. ఇత‌ర రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు ఎన్ని ఇబ్బందులు వ‌స్తున్నా.. దీనిని మాత్రం అమ‌లు చేయ‌డం లేదు.

ఇక‌, ఓటీ ఎస్‌. దీనిని కూడా ప్ర‌జ‌లు స‌హించ‌డం లేదు. అయినా.. ప్ర‌భుత్వం మాత్రం ముందుకు వెళ్తోంది. మూడోది రైతు ప్ర‌భుత్వంగా చెప్పుకొనే రాజన్న రాజ్యంలో రైతుల విద్యుత్కు మీట‌ర్లు బిగించ‌డం. దీనిపై నాఅన్న‌దాత‌లు తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్నారు. అయినా.. జ‌గ‌న్ మాత్రం ముందుకే వెళ్తున్నారు. ఇవ‌న్నీ.. చిన్ని చిన్న విష‌యాలు.. అయినా.. కూడా ఆయ‌న త‌న ప‌ద్ధ‌తిలోనే ముందుకు సాగుతున్నారు.

మ రిమ‌నంద‌రి ప్ర‌భుత్వం అయిన‌ప్పుడు.. ఇలాంటి విష‌యాల‌పై ఎందుకు వెన‌క్కి త‌గ్గ‌డం లేదు..? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఇదే విష‌యాన్ని మేదావులు కూడా ప్ర‌శ్నిస్తున్నారు.