Begin typing your search above and press return to search.
నిత్యానంద శిష్యురాళ్లు..తండ్రి పైనే సంచలన వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 31 Dec 2019 2:02 PM GMTవివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సినీ నటి రంజితతో క్రమ క్రీడలు సాగిస్తూ వీడియోకు దొరికిపోయి అభాసుపాలైన నిత్యానంద.. ఆ తర్వాత మరెన్నో సందర్భాల్లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ ప్రాంతంలో ఒక దీవిని కొనుక్కుని దానికి కైలాసం అని పేరు పెట్టి తనకు తానుగా దానికి అధిపతిగా ప్రకటించుకోవడం ద్వారా నిత్యానంద వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే ఈ కైలాసాన్ని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించాలని , ఆ దేశానికీ ఎవరైనా వెళ్లాయి అనుకుంటే ప్రత్యేక వీసా కూడా తీసుకోవాలని వార్తలు వచ్చాయి.
అయితే, గత కొన్ని రోజుల ముందు జనార్దన్ శర్మా దంపతులు తమ నలుగురు కుమార్తెలని నిత్యానంద బారి నుండి కాపాడాలని కోర్టు కెక్కాడు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ ఉన్న నలుగురి నుండి ఇద్దరు మైనర్ బాలికను పోలీసులు రక్షించారు. ఇదే సమయంలో జనార్దన్ శర్మాతో వారి ఇద్దరు పెద్ద కుమార్తెలు నిరాకరించడంతో పోలీసులు చేతులు ఎత్తేశారు. మేము నిత్యానంద ఆశ్రమంలోనే ఉంటామని, మా తల్లిదండ్రులతో వెళ్లమని జనార్దన్ శర్మా కుమార్తెలు చెప్పారని పోలీసులు చెప్పారు.
అయితే, ఇద్దరు టీనేజీ అమ్మాయిల్ని వశపరుచుకుని వాళ్ల జీవితాల్ని నాశనం చేస్తున్నాడంటూ జనార్దన్ శర్మ నిత్యానంద పై మరోసారి కోర్టుకెక్కాడు. ఈ కేసు విచారణ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం నిత్యానంద ఆ కైలాసంలోనే ఉన్నట్లు సమాచారం అతడి వెంటే , ఆ ఇద్దరు టీనేజీ అమ్మాయిలున్నారు. మా నిత్యానందిత, మా తట్టువప్రియ పేర్లతో నిత్యానంద దగ్గర ఉంటున్న ఆ ఇద్దరు అమ్మాయిలు తమ కుమార్తెలని.. నిత్యానంద వారిని తప్పుదోవ పట్టించాడని.. వారిని తన వద్దకు చేర్చాలని జనార్దన్ శర్మ కోర్టుని కోరాడు. ఈ కేసు విచారణ సందర్భంగా ఆ ఇద్దరు అమ్మాయిలు వీడియో ద్వారా మాట్లాడారు. వారు మాట్లాడుతూ ... తాము పూర్తి ఇష్టంతోనే నిత్యానందతో పాటు కైలాసంలో సంతోషంగా ఉన్నామని.. తమకు తండ్రి నుంచే ప్రాణ హాని ఉందని వాళ్లు తండ్రి పైనే ప్రత్యారోపణలు చేయడం గమనార్హం. అయితే , కోర్టు వారి వాదనతో అంగీకరించలేదు. వాళ్లు ఏ దేశంలో ఉన్నప్పటికీ సంబంధిత ఎంబసీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఐతే ఆ ఇద్దరు అమ్మాయిలు తమ తండ్రిపై ఆరోపణలు గుప్పిస్తూ ప్రత్యేకంగా మరో వీడియోను రిలీజ్ చేయడం గమనార్హం.