Begin typing your search above and press return to search.
మూడేళ్ల వైసీపీ పాలన.. జగన్ విజన్ ఏంటి...?
By: Tupaki Desk | 30 May 2022 4:30 PM GMTఏపీలో వైసీపీ మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. అయితే.. దీనికి సంబంధించి సంబరాలు చేసుకునే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. నిజానికి తొలి ఏడాదిపూర్తికాగానే సంబరాలు చేసుకునేందుకు నాయకులు ఉత్సాహం చూపించారు.కానీ, అప్పటికే కరోనా చుట్టుముట్టడంతో అది గాలికిపోయింది. ఇక, రెండో ఏడాది పరిస్థితి కూడా అలానే ఉంది. పైగా ఇసుక, మద్యం వంటివి ప్రధానంగా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. దీంతో సంబరాల జోలికి పోలేదు.
ఇక, ఇప్పుడు మూడో ఏడాది ఈ నెల 30తో పూర్తి కానుంది. సీఎంగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణ స్వీకారం చేసి.. మూడేళ్లు అయింది. దీంతో సంబరాలు చేసుకునేందుకు వైసీపీ నాయకులు రెడీ అవుతున్నారు.
కానీ, ఎక్కడా ఆ తరహా జోష్ కనిపించడం లేదు. ఇప్పటికే చేపట్టిన.. బస్సు యాత్ర విఫలమైంది. ఎక్కడా ప్రజల నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు. మరోవైపు.. గడప గడపకు మన ప్రభుత్వం పేరిట.. కార్యక్రమం నిర్వహిస్తున్నా.. ప్రజల నుంచి ఛీత్కారాలే వినిపిస్తున్నాయి.
ప్రజల నుంచి అనూహ్యమైన వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో వైసీపీ నాయకుల్లో అంతర్మథనం కనిపిస్తోం ది. ఈ పరిణామాలు.. పార్టీని.. నాయకులను కూడా ఇబ్బంది పెడుతున్నాయి. మూడేళ్లు అయినప్పటికీ.. జగన్ విజన్ ఏంటో ప్రజలకు అర్ధం కాలేదు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. ఆయన విజన్‌పై స్పష్టత ఉండేది. ఆయన అభివృద్ధి విజన్‌గా ముందుకు సాగారు. దీంతో ప్రజలు ఆయన విజన్‌ను అర్ధం చేసుకున్నారు.
కానీ, మూడేళ్లయినా.. జగన్ విజన్ అర్ధం కాలేదని ప్రజలు అంటున్నారు. ఎందుకంటే.. సంక్షేమం అందామా.. అందరికీ కోతలు వేస్తున్నారు. గత ఏడాది లబ్ధి దారులుగా ఉన్నవారిని ఈ ఏడాది చాలా మందితీసేశారు. గత ఏడాది 6 లక్షల మందికి అమ్మ ఒడి ఇస్తే.. ఇప్పుడు 3 వేల మందికి మాత్రమే ఈదీనిని అమలు చేస్తున్నారు.
అంటే.. సంక్షేమం మా విజన్ అని చెబుతున్నా.. ఇది కూడా అందరికీ అందడం లేదు. పోనీ.. అభివృద్ధి, మూడు రాజధానులు విజన్ అందామా? అది కూడా కనిపించడం లేదు. దీంతో జగన్ విజన్ ఏంటనేది ఇప్పుడు ప్రజల్లో చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో జగన్ మూడేళ్ల సర్కారుసంబరాలు ఎలా చేసుకుంటామనేది నాయకుల్లో ప్రశ్నగా మారిపోయింది.