Begin typing your search above and press return to search.

ఇపుడు వాళ్ళ పరిస్ధితి ఏమిటి ?

By:  Tupaki Desk   |   17 Oct 2022 6:34 AM GMT
ఇపుడు వాళ్ళ పరిస్ధితి ఏమిటి ?
X
ముందునుండి అనుమానిస్తున్నట్లే జనసేన పార్టీ తేల్చేసింది. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో మంత్రుల కార్లపై దాడిచేసిన వారితో పార్టీకి ఎలాంటి సంబంధంలేదని జనసేన స్పష్టంగా చెప్పేసింది. 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉన్న కారణంగా హోటల్లో నుండి పవన్ బయటకు రాకూడదని, పబ్లిక్ గేదరింగ్, మీటింగులు, ర్యాలీలు నిర్వహించకూడదని పోలీసులు నోటీసు ఇచ్చారు. దాన్ని రిసీవ్ చేసుకునే సందర్భంలో నోటీసును తీసుకున్న నేతలు ప్రొటెస్టు అని చెప్పి నోటీసును తీసుకున్నారు.

ప్రొటెస్టు నోటీసులో భాగంగా ఎయిర్ పోర్టు దగ్గర పబ్లిక్ గేదరింగ్ తో తమకేమీ సంబంధం లేదన్నారు. హైదరాబాద్ నుండి విశాఖపట్నంకు విమానం సాయంత్రం 4.40 గంటలకు చేరుకున్నట్లు పెన్నుతో రాసి సంతకం కూడా పెట్టారు. సరిగ్గా సంతకాన్ని ఎవరిదో వేలు కప్పేసింది కాబట్టి ప్రొటెస్టు అని చెప్పి నోటీసును ఎవరు తీసుకున్నది తెలీటంలేదు. సంతకం ఎవరిదైనా, నోటీసును అందుకున్నది ఎవరైనా విశాఖపట్నం ఎయిర్ పోర్టు దగ్గర గేదరింగ్ తో తమకు ఎలాంటి సంబంధంలేదని తేల్చేయటం వాస్తవం.

దీనివల్ల ఇపుడు సమస్య ఏమిటంటే సీసీ కెమెరాల్లో వీడియోల ద్వారా దాడులకు పాల్పడిన వారిని గుర్తించి పోలీసలులు కేసులు పెట్టి అరెస్టులు చేశారు. ఒకవైపు వీడియో సాక్ష్యాల ఆధారంగా పోలీసులు అరెస్టులు చేసి కేసులుపెట్టారు. ఇంకోవైపు పబ్లిక్ గేదరింగ్ తో తమకు సంబంధంలేదని జనసేన తేల్చేసింది. పోలీసలేమో ఎయిర్ పోర్టులో గుమిగూడిన జనసైనికులే మంత్రుల కార్లపై దాడులుచేసినట్లు కేసులు నమోదుచేశారు.

అంటే ఇపుడు అరెస్టయిన వారి కథ అయిపోయినట్లే. 88 మందికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఎందుకంటే అరెస్టయిన వాళ్ళ తరపున పార్టీ మద్దతుగా నిలబడదు. ఒకవేళ అరెస్టయిన వాళ్ళకి మద్దతుగా నిలబడితే మంత్రులపై దాడులు చేసింది తమ కార్యకర్తలే అని పార్టీ అంగీకరించినట్లవుతుంది. అదే జరిగితే ఇపుడు పవన్ చేస్తున్నదంతా ఉత్త డ్రామాగా తేలిపోతుంది. కాబట్టి అరెస్టయిన వాళ్ళంతా ఇక కోర్టుల చుట్టూ, జైళ్ళచుట్టూ తిరుగుతుండాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.