Begin typing your search above and press return to search.
సుద్దులు చెప్పే రెడ్డి గారి నిర్వాకం చూశారా... ఈ రేంజ్ లోనా?
By: Tupaki Desk | 21 July 2022 5:30 AM GMTప్రజాస్వామ్యం గురించి లెక్షర్లిమ్మంటే గంటలకొద్దీ మాట్లాడుతారు. కానీ తనదాకా వచ్చేసరికి ప్రజాస్వామ్యం లేదు తొక్కాలేదు పొమ్మంటారు. ఇంతకీ ఎవరా ఎంఎల్ఏ అనుకుంటున్నారా ? ఆయనే తిరుపతి వైసీపీ ఎంఎల్ఏ భూమన కరుణాకరరెడ్డి. బుధవారం జరిగిన తిరుపతి కో ఆపరేటివ్ టౌన్ బ్యాంకు పాలకవర్గం ఎన్నికల తీరును చూసిన తర్వాత భూమన చెప్పే ప్రజాస్వామ్యం అంతా నేతిబీరకాయ సామెతలాగే ఉందని తెలుసుకున్నారు.
వందేళ్ళ చరిత్రున్న టౌన్ బ్యాంక్ ఎన్నికలను వైసీపీ, టీడీపీలు అత్యంత ప్రతిష్టగా తీసుకున్నాయి. పోలింగ్ కోసం ఎస్జీఎస్ కాలేజిలో అధికారులు 130 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 12 డైరెక్టర్ పోస్టులకు 45 మంది పోటీపడ్డారు.
వీరిలో వైసీపీ, టీడీపీ రెండు ప్యానళ్ళు కూడా ఉన్నాయి. 57,215 ఓట్లున్న బ్యాంకుఎన్నికలో అత్యధిక ఓట్లు పోలవుతాయనే అందరు అనుకున్నారు. టౌన్ బ్యాంకు పాలకవర్గం ఎన్నికను రెండుపార్టీలు ఎందుకింత ప్రతిష్టగా తీసుకున్నాయి ?
ఎందుకంటే తిరుపతి అసెంబ్లీ నియోజవర్గంలో సుమారు 2.4 లక్షల ఓట్లుంటే టౌన్ బ్యాంకు ఎన్నికల్లో ఓట్లు 57 వేల ఓట్లు. అంటే దాదాపు ఐదోవంతు ఓట్లున్నాయి కాబట్టే రెండుపార్టీలు ఇంత ప్రతిష్టగా తీసుకున్నాయి.
అయితే పోలింగ్ సందర్భంగా బాగా దౌర్జన్యాలు జరిగాయి. సజావుగా పోలింగ్ జరగకుండా భూమన+ఆయన కొడుకు అభినయరెడ్డితో పాటు వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. వీళ్ళ అరాచకాలు ఏ స్ధాయిలో జరిగాయంటే పోలింగ్ ను టీడీపీ ఏకంగా బహిష్కరించింది.
ప్రతిపక్షాలు పోలింగ్ ను బహిష్కరించేంతగా ధౌర్జన్యాలు జరగటంలోనే ఎంఎల్ఏ చెప్పేంత ప్రజాస్వామ్యం ఏ స్ధాయిలో ఆచరణలో ఉందో అర్ధమైపోతోంది. నీతులు ఆచరించేందుకు కాదు కేవలం చెప్పేందుకే అన్నట్లుగా ఉంది భూమన వైఖరి. కొడుక్కి ఇప్పటినుండే బాగానే ట్రైనింగ్ ఇస్తున్నట్లున్నారు చూస్తుంటే. తండ్రీ, కొడుకుల నాయకత్వంలో ప్రజాస్వామ్యం మరింతగా పరిడవిల్లాలని అందరం కోరుకుందాం.