Begin typing your search above and press return to search.

ఈ బావినీళ్లతో కవలలు.. ఎగబడుతున్నారు..

By:  Tupaki Desk   |   5 July 2019 5:32 AM GMT
ఈ బావినీళ్లతో కవలలు.. ఎగబడుతున్నారు..
X
ఆ బావి నీళ్లు తాగితే కవలలు పుడుతారట.. నిజంగా ఇది నిజమే.. అందుకే ఇప్పుడా బావికి ఫుల్ డిమాండ్. ఆ నీటిని భారీ ధరకు కూడా అమ్ముకుంటున్నారు. ఆ బావి నీరు ఇప్పుడు విశాఖ- గుంటూరు- హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

పిల్లలు లేని దంపతులు.. కొత్తగా పెళ్లై పిల్లలు పుట్టని జంటలు ఇప్పుడు ఈ బావినీరు తాగేందుకు వస్తున్నారట.. తూర్పుగోదావరి జిల్లాలోని రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో ఈ బావి ఉన్నది. నాలుగువేల జనాభా ఉన్న ఈ మారుమూల గ్రామం ఊరంతా పచ్చని పొలాలతో కళకళలాడుతూ ఉంటుంది. అయితే ఈ గ్రామంలో ఓ బావి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కారణం ఆ బావిలో నీళ్లు తాగితే కవలలు జన్మిస్తున్నారనే విశ్వాసం.

అయితే లక్షలు ఖర్చు పెడుతున్నా పుట్టని పిల్లలు బావి నీళ్లు తాగితే పుడతారా అంటే ఎవరి నమ్మకాలు వారివీ.. శాస్త్రీయంగా ఇలా జరగదు.. ఇదో మూఢ నమ్మకం. కానీ అక్కడ జరిగిన వాస్తవం మాత్రం మన కళ్లముందే ఉంది.

ఈ దొడ్డిగుంట గ్రామంలోని ఈ బావి నీరు తాగిన 110మందికి పైగా మహిళలకు కవల పిల్లలు పుట్టడం గమనార్హం. ఈ ఉళ్లో ప్రతి వీధిలో నలుగురైదుగురు కవలులన్న ఇండ్లు కనిపిస్తాయి. ఆ ఊళ్లోని ప్రతీ తరగతిలో రెండు, మూడు కవలల జంటలున్నాయి.

బదిలీపై ఈ ఊరు పాఠశాలకు వచ్చిన బండి శ్రీనివాసమూర్తి అనే ఉపాధ్యాయుడు ఈ కవలలను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ ఊళ్లోనే అద్దెకున్న ఆయనకు కూడా కవలలు పుట్టడంతో ఈ బావి మహత్మ్యం గురించి వెలుగులోకి వచ్చింది. ఈ దొడ్డిగుంట పంచాయతీ పరిధిలో ఉండే చెరువు, దాని గట్టుపైన ఈ బావి ఉంది. ఈ బావి నీరు తాగిన వారికి కవలలు జన్మిస్తారని ఇక్కడి ప్రజలు నమ్ముతాయి. గ్రామంలో రక్షిత మంచినీరు, కుళాయిల ద్వారా శుద్ధనీరు సరఫరా అవుతున్నా పిల్లలు లేని వారు ఈ బావి నీరునే తాగేందుకు వస్తున్నారు. కొత్తగా పెళ్లయిన జంటలకు ఈ నీరును తాగిస్తున్నారు. సంతానం లేని వారికి నీటిని ఇస్తారు.

అయితే ఈ బావి నీటిలో ఏదో అతీత శక్తి ఉందని ఆ గ్రామస్థుల నమ్మకం. తాగిన వారందరికీ కవలలు పుట్టడంతో ఇది వైరల్ గా మారింది. దీంతో భూగర్భ జలవనరుల శాఖ ఈ బావిలోని నీటిని వైజాగ్, హైదరాబాద్ కు ప్రయోగశాలకు పంపింది. మరి ఈ నీటిలోని మహత్మ్మం ఏంటనేది తేలాల్సి ఉంది.